Big Stories

Kharge Counter on PM Modi: పీఎం మోదీకి ఖర్గే కౌంటర్.. ఇంకెంతకాలం అవే మాటలు..?

Kharge Counter on PM Modi Comments: పార్లమెంటు సమావేశాలు ఇంకా మొదలుకాక ముందే అధికార బీజేపీ- విపక్షాల కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కాలం నాటి ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రియాక్ట్ అయ్యారు.

- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. అందుకే అన్ని పార్టీల నేతలు ఒక్క తాటిపైకి వచ్చి ఇక్కడ నిరసనలు తెలుపుతున్నామన్నారు. ఇక్కడ మహాత్మాగాంధీ విగ్రహం ఉందని, వారంతా ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ నుంచి ప్రధాని మోదీ రాజ్యాంగ ప్రకారం ముందుకు సాగాలని కోరుతున్నామన్నారు.

- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ ఎమర్జెన్సీ గురించి పదేపదే  మాట్లాడటాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ఈ మాటను ఆయన వంద సార్లు చెప్పారని, దీని గురించి ఇంకెంత కాలం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. ఎమర్జెన్సీ గురించి మాట్లాడి ఎంతకాలం పాలించాలనుకుంటున్నారంటూ కౌంటరిచ్చారు.

Also Read: Kejriwal Bail : కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ పై స్టే కంటిన్యూ

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఇదో అద్భుతమైన రోజుగా వర్ణించారు. అంతేకాదు దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడి జూన్ 25 నాటికి 50 ఏళ్లు పూర్తి అవుతున్నాయని, ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక మచ్చగా మిగిలిపోయిందన్నారు. ఇది మరల పునరావృతం కాకూడదన్నారు. ఇదే క్రమంలో విపక్షాలకు చురకలంటించారు.

దేశానికి మంచి విపక్షం అవసరమని, ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా ఉండాలన్నారు ప్రధాని. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవడం లేదని, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు సహకరించాలని హితవు పలికారు ప్రధాని నరేంద్రమోదీ.

Also Read: యూజీసీ నెట్ పేపర్ లీక్ ఎంక్వైరీ, సీబీఐ టీమ్‌పై గ్రామస్తుల దాడి

సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం తొలిరోజు ఇలాగైతే, రానున్న సమావేశాలు ఇంకెంత హాట్ హాట్‌గా సాగుతాయని చర్చించుకుంటున్నారు నేతలు. బలమైన ప్రతిపక్షమున్న నేపథ్యంలో సభను సజావుగా నడపడం ఎన్డీయే సర్కార్‌కు అంత ఈజీ కాదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News