Big Stories

Madhya Pradesh Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆలయానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు స్పాట్ డెడ్

Madhya Pradesh Road Accident(Telugu news live today): మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దాతియా జిల్లాలో ఆలయానికి భక్తులను తీసుకెళ్తుండగా ఓ ట్రాక్టర్.. శుక్రవారం తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. రతన్‌గఢ్ మాతా మందిరానికి వెళ్తుండగా మైథానపాలి గ్రామ సమీపంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.

- Advertisement -

15 అడుగుల లోయలో పడిన ట్రాక్టర్

- Advertisement -

దిస్వార్‌కు చెందిన భక్తులు రతన్‌గఢ్ మాతా మందిరానికి పుష్పాలు సమర్పించడానికి వెళ్తుండగా మైథాన పాలి సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ అదుపు తప్పి 15 అడుగు కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా పడిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 30 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారన్నారు. బాధితులను దతియా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: నాగపూర్‌లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..

మృతులు వీళ్లే…

ట్రాక్టర్ అదుపుతప్పిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. సోనమ్ చందన్ అహిర్వార్, వినీత పూరాన్ పాల్, నావల్ కిశోర్, కమ్నీ నావల్ కిశోర్, సీపతి నావల్ కిశార్ మృతి చెందారు. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై దతియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీరేంద్ర మిశ్రా విచారం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఒకరిని గ్వాలియర్ ఆస్పత్రికి, మరొకరిని ఝాన్సీకి తరలించామని ఎస్పీ వీరేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News