Big Stories

Bomb Threat to Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అనుమానితుడు అరెస్ట్..!

Bomb threat to Air India Flight: కొచ్చిన్ నుంచి లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని ముంబై నుంచి కొచ్చి ఎయిర్‌పోర్టు అధికారులకు చేరవేశారు.

- Advertisement -

ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇన్‌ లైన్ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా లగేజీని చెక్ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

ఎయిరిండియాకు చెందిన ఏఐ 149 నెంబరు గల విమానం కొచ్చి ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో విమానంలో బాంబు పెట్టినట్టు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తనిఖీలు తర్వాత ఏమీ లేవని తేలడంతో లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు కొచ్చిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

ALSO READ: తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్, విపక్షాలకు చిక్కిన ప్రధాని మోదీ

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మలప్పురం జిల్లాకు చెందిన సుహైబ్‌గా తేల్చారు. కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో చెకిన్ సమయంలో సుహైబ్, అతడి భార్య, కూతుర్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ఈ మధ్యకాలంలో స్కూల్స్, ఎయిర్‌పోర్టులకు విపరీతంగా బాంబు బెదిరింపుల వస్తున్నాయి. దీంతో ఎయిర్‌పోర్టు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News