Big Stories

Sonia Gandhi on NDA: ఎన్డీఏ ఏకపక్ష నిర్ణయాలు ఇక నుంచి చెల్లవు: సోనియా గాంధీ!

Sonia Gandhi Comments on PM Modi Decisions: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి రాజకీయ, నైతిక ఓటమిగా కాంగ్రెస్ పార్లమెంటరీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభివర్ణించారు. ఈ ఫలితాలతో ప్రధాని మోదీ నైతికంగా నాయకత్వ హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఓటమికి బాధ్యత వహించకుండా మరో సారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారిని విమర్శించారు.

- Advertisement -

శనివారం పార్లమెంటరీ సెంట్రల్‌హాల్‌లో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా మరోసారి ఎన్నికయ్యారు. సమావేశం అనంతరం సోనియా గాంధీ ఎంపీలను ఉద్ధేశించి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రత్యేక బాధ్యత తమపై ఉందన్నారు.

- Advertisement -

దశాబ్దకాలంగా పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. తాజా ఎన్నికల ఫలితాలతో ఇకపై ఆ పరిస్థితి ఉండదని సోనియా గాంధీ స్పష్టం చేశారు. చర్చలకు అంతరాయం కలిగించడం, ఏకపకక్షంగా చట్టాలను తీసుకురావడం, పార్లమెంటరీ కమిటీలను విస్మరించడం వంటివి ఇకపై జరగవన్నారు.

Also Read: ముచ్చటగా మూడోసారి.. మోదీ 3.0 ఎలా ఉండబోతోంది?

తెలంగాణలో ఎంపీ ఫలితాలు నిరాశ పరిచాయని సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో అన్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో సుమారు 12 సీట్లు గెలుస్తామని ఆశించగా.. తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయని సీఎంను అడిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెల్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్ర నేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ సమావేశం అయినట్లు  తెలుస్తోంది. ఈ సందర్భంగానే సోనియా గాంధీకి ఎంపీ ఫలితాలు, పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై సీఎం వివరణ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా క్యాబినెట్ విస్తరణ కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైన కూడా సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో సోనియా పలు అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News