Big Stories

LK Advani admitted in Hospital: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

LK Advani Suffering Health Problems: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం అర్ధరాత్రి వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తతం వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స అందుతుందని చెప్పారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

96 ఏళ్ల అద్వానీ ఎయిమ్స్ లోని ప్రైవేట్ వార్డులో యూరాలజీకి సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.  అయితే విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

బీజేపీ కురు వృద్ధుడు అయిన అద్వానీ.. బీజేపీని దేశ వ్యాప్తంగా విస్తరించడంలో దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయితోపాటు ఈయన కీలక పాత్ర పోషించారు. దాదాపు నాలుగు దశాబ్ధాల ఆయన రాజకీయ జీవితంలో రథయాత్ర కీలక ములుపు తిరిగింది. ఈ యాత్ర ద్వారా బీజేపీకి దేశ వ్యాప్తంగా అద్వానీ ఊపు తీసుకొచ్చారు. 1999-2004 మధ్య ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు.

Also Read: Loksabha Deputy speaker race: డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే- ఇండియా కూటమికా? లెక్కలు..

బీజేపీ అధ్యక్షుడిగా కూడా అద్వానీ పనిచేశారు. అయితే గత పదేళ్లుగా అద్వాణీ పూర్తి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈ ఏడాది అద్వానీ భారతరత్న అందుకున్నారు. వయో భారం దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వయంగా ఆయన నివాసానికి చేరకొని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో భారతరత్న పురస్కారాన్ని అందజేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News