Big Stories

Liquor Sales on Worldcup Final Match : ఘల్లు మంది గ్లాసు.. మ్యాచ్ రోజు మునిగి తేలారు

Liquor Sales Jump 40-50% on T20 Final Night(Telugu news live): టీ 20 ప్రపంచకప్ గెలవడం కాదు కానీ, మ్యాచ్ రోజు ఇండియాలో బీర్లు పొంగి పొర్లాయి. మందు బాటిళ్లకు బాటిళ్లు మంచినీళ్లలా తాగి పారేశారు. ఇక బిర్యానీలు, చికెను, మటన్, పీజాలు, బగ్గర్ల ఆర్డర్లు హోరెత్తిపోయాయి. క్విక్ కామర్స్ ద్వారా ఆర్డర్లు పెడుతూనే ఉన్నారు. స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, ఇన్ స్టామార్ట్ ఇవన్నీ నాన్ స్టాప్ గా పనిచేశాయి. మ్యాచ్ జరిగిన మూడు గంటలైతే డెలివరీ బాయ్స్ రయ్ రయ్ మని, బైక్ లమీద భారతదేశంలోని గల్లీగల్లీలు తిరుగుతూనే ఉన్నారు. ఇవే కాదు.. ఆ రోజు చిన్న,పెద్ద నగరాలు, పట్టణాల్లో హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్ లతో కిక్కిరిసి పోయాయి.

- Advertisement -

మద్యం, నాన్ వెజ్ హోటళ్ల వ్యాపారం మ్యాచ్ రోజున 40 శాతం పెరిగిందని అంటున్నారు. పిన్ టెక్ స్టార్టప్ సింపుల్ రిపోర్ట్ ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కేవలం ఆన్ లైన్ల మార్కెట్లలో 40 నుంచి 50 శాతం బిజినెస్ పెరిగిందని తెలిపారు. ఇది కాకుండా ప్రజలు డైరక్టుగా వెళ్లిన పబ్ లు, బార్లు, రెస్టారెంట్లు వీటిల్లో ఎంతయిందో లెక్కే లేదని అంటున్నారు.

- Advertisement -

Also Read : రోహిత్, కొహ్లీ స్థానాలను భర్తీ చేసేవారున్నారా?

మ్యాచ్ రోజు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్డర్లు నాన్ స్టాప్ గా పెడుతూనే ఉన్నారు. ఒక వ్యక్తి ఆరోజు అత్యధికంగా క్విక్ కామర్స్ లో రూ.16,410 ఖర్చు చేశాడని తేలింది. ఇంక వంద రూపాయల ఆర్డర్లయితే లెక్కలేదని తెలిపారు. మరో వినియోగదారుడైతే ఏకంగా 59 ఆర్డర్లు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ తో పోల్చుకుంటే, ఈసారి ఆర్డర్లు 35 శాతం పెరిగాయని అంటున్నారు. నిజానికి మ్యాచ్ శనివారం జరిగింది కాబట్టి సరిపోయింది. అదే ఆదివారం జరిగి ఉంటే, భూమి ఆకాశం కలిసిపోయేదని, బీభత్సకాండ జరిగేదని అంటున్నారు.

ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలోని విరాట్ కోహ్లీకి చెందిన ’వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్’ పూర్తిగా నిండిపోయింది. అలాగే దీ బీర్ కేఫ్ రెస్టారెంట్ ప్రారంభమై 12 ఏళ్లు గడిచింది. గతంలో ఎన్నడూ లేనంతగా సింగిల్ డే రెవెన్యూను ఆ రెస్టారెంట్ చైన్ సాధించింది. ఇవే కాదు దేశమంతా హోటల్ , బార్ల బిజినెస్ మహా జోరుగా సాగింది. ఇంత జన సామర్థ్యాన్ని చూడటం ఇదే మొదటిసారి అని చాలామంది వ్యాపారులు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఈసారి మనవాళ్లు వరల్డ్ కప్ గెలిచిన ఆనందంతో కొంచెం ఎక్కువ తాగినట్టున్నారు. అదే ఓడిపోయి ఉంటే, ఆ బాధలో ఇంతకన్నా ఎక్కువ తాగేసేవారేమో కదా.. అంటున్నారు. నిజమే కదా..!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News