Big Stories

Sharad Pawar: లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయం: శరద్ పవార్

Sharad Pawar: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది కాంగ్రెస్ నిర్ణయిస్తుందని ఎస్పీ నేత శరద్ పవార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీకి చెందిన నేతకు లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయని.. ఈ నేపథ్యంలోనే ఎవరు ప్రతిపక్షహోదాలో ఉంటారనే దానిపై ఆ పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఆ తర్వాత అందుకు కూటమి సభ్యుల ఆమోదం కూడా అవసరమని తెలిపారు.

- Advertisement -

జూన్ 24 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. లోక్ సభ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశాన్ని నిర్వహించి లోక్‌సభ ప్రతిపక్ష నేతను ఎన్నుకుంటుందని తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించే అవకాశం లేదని తెలిపారు. ఈ సందర్భంగా శరద్ పవార్ బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. మోడీ హామీలపై ప్రజలు అవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు.

- Advertisement -

Also Read: వ్వవస్థలను బీజేపీ కబ్జా చేయడం వల్లే పేపర్ లీకేజీలు: రాహుల్ గాంధీ

మహారాష్ట్రలో అక్టోబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 288 సీట్లకు గానూ కనీసం 155 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 48 స్థానాలకు గానూ ఎంవీఏ మిత్ర పక్షాలు 31 సీట్లు గెలుచుకున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 155 పైగా సీట్లను గెలుస్తామని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమీవేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News