Big Stories

Koo App Shut Down: కూ యాప్ క్లోజ్.. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో..

Koo App to Shut Sown: దేశీయ సోషల్‌మీడియా కూ యాప్ మూతపడింది. యూజర్స్‌తో ఆ యాప్‌కు ఉన్న బంధం తెగింది. బుధవారం (నేటి) నుంచి ఈ యాప్ తన కార్యకలాపాలను మూసివేసింది. వివిధ కంపెనీలు కూ యాప్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయి. చివరకు చర్చలు విఫలం కావడంతో మూసి వేయాలని నిర్ణయించుకున్నారు ఫౌండర్.

- Advertisement -

దేశీయ సోషల్ మీడియా యాప్ కూ.. ఇది ఎక్స్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించారు. కోట్లలో వినియోగదారులను కూడ బెట్టుకుంది. తక్కువ సమయంలో యూజర్స్‌ని బాగా పెంచుకుంది. తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆర్థిక సమస్యలు ఆ కంపెనీని చుట్టుముట్టాయి. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది.

- Advertisement -

ఈ ఏడాది లే ఆఫ్ ప్రకటించింది కూడా. అవేమీ కూ ఆదుకోలేకపోయాయి. కూ గురించి తెలుసుకున్న డైలీ హంట్ సహా పలు సంస్థలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే చర్చలు విఫలం కావడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు కూ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో ఓ పోస్టు పెట్టారు.

Also Read: పానీ పూరీ.. బ్యాన్ విధించేందుకు కర్ణాటక, తమిళనాడు రెడీ!

2019లో కూ యాప్ ప్రారంభమైంది. దీన్ని అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా కలిసి ప్రారంభిం చారు. దీనికి రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరించారు. రైతు ఉద్యమం సమయంలో కేంద్రంతో X కి ఘర్షణ నెలకొంది. ఆ సమయంలో కూ యాప్ బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్రమంత్రులు స్వయంగా ఆత్మనిర్బర్ యాప్‌గా దీన్ని ప్రమోట్ చేశారు. అక్కువ సమయంలో ఆఫ్రికా, దక్షిణ అమెరికాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. చివరకు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కలేక మూతపడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News