Big Stories

Kedarnath Massive avalanche: కేదార్‌నాథ్‌లో మంచు ఉప్పెన, యాత్రికులు సేఫ్

Kedarnath Massive avalanche: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం సంభవించింది. ఆదివారం ఉదయం సరోవర్ కొండలపై నుంచి హిమపాతం దూసుకొచ్చింది. కేదార్‌నాథ్‌కు నాలుగు కిలోమీటర్ల వరకు దూసుకొచ్చింది. దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

ఉత్తరాఖండ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్. అయితే ఈ క్షేత్రానికి సమీపంలో అనూహ్య ఘటన జరి గింది. కేదార్‌నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల ఎగువన గాంధీ సరోవర్‌పై మంచు ఉప్పెన విరుచుకు పడింది. పెద్ద మొత్తంలో మంచు కిందికి దూసుకొస్తున్నట్లు వీడియోల్లో కనిపించింది. ఆ తర్వాత హిమ పాతం కాస్త నెమ్మదించి అక్కడే ఆగిపోయింది. ఆలయ సందర్శన కోసం అక్కడి వెళ్లిన భక్తులు ఆయా దృశ్యాలను తమ తమ ఫోన్లలో బంధించారు. మరికొందరు ఆందోళనకు గురయ్యారు.

- Advertisement -

దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదని రుద్ర ప్రయాగ్ పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. కేదార్‌నాథ్ సహా ఆ ప్రాంతమంతా సురక్షితంగా ఉందన్నారు. హిమాలయ ప్రాంతంలో ఇలాంటి సాధారణమేనన్నారు. కాకపోతే కేదార్‌నాథ్ ధామ్ ప్రాంతంలో భద్రత మెరుగు పరుచుకోవాలని సూచించారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. వాతావరణ శాఖల నుంచి నివేదికలు తీసుకుని ఆ సమయంలో దేవాలయాలను సందర్శించడం మానుకుంటే బెటరని అంటున్నారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News