Big Stories

Karnataka horrific accident: కర్ణాటకలో దారుణమైన యాక్సిడెంట్, లారీని ఢీ కొన్ని టెంపో, 14 మంది మృతి

Karnataka horrific accident: కర్ణాటకలో దారుణమైన యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆగివున్న లారీని టెంపో ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది స్పాట్‌లో మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన హవేరి జిల్లాలో జరిగింది.

- Advertisement -

కర్ణాటకలోని హవేరి జిల్లా సమీపంలోని పూణె-బెంగుళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు శివమొగ్గ జిల్లా భధ్రవతి తాలూకాలోని ఎమ్మిహట్టి గ్రామానికి చెందినవారు. వీరంతా బెల్గావిలోని సవదట్టి ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని బయలుదేరారు.  తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

ప్రమాదం గురించి సమాచారం అందుకునే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులూ ఉన్నారు. బలంగా ఢీ కొట్టడంతో ట్రావెల్ టెంపో నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి. ఘటన సమయంలో టెంపోలో 17 మంది ప్రయాణికులు ఉన్నారు.

ALSO READ:  ఢిల్లీలో భారీ వర్షం, ఎయిర్‌పోర్టులో కూలిన పైకప్పు, ఆరుగురికి గాయాలు

గాయపడిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు కోలుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. టెంపో అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News