Big Stories

Fuel Prices Hike: పెట్రో బాంబ్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం

Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకంది. ఈ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగగా.. లీటర్ డీజిల్ ధర రూ. 3.02 పెరిగింది. కర్ణాటక సేల్స్ ట్యాక్స్ పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచినట్లు ప్రభుత్వ నోటిఫికేషన్ వెల్లడించింది. దీంతో ప్రజలపై అదనపు భారం పడనుంది.

- Advertisement -

కాగా, సేల్స్ ట్యాక్స్ పెంచుతూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

- Advertisement -

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం బట్టబయలైందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఉందని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, ఆపై కాంగ్రెస్ పార్టీ, సొంత రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని తెలిపారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు వ్యతిరేక, సామాన్యుడి వ్యతిరేక ఉత్తర్వు, ఫత్వా, జిజియా పన్నును ఆమోదించారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Also Read: ఎన్డీఏ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు: ఖర్గే జోస్యం

కర్ణాటకలో అమలు చేస్తోన్న పథకాల వల్లే రాష్ట్రం దివాలా తీసిందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్‌పై సేల్స్ ట్యాక్స్ పెంచిందని షెహజాద్ ఆరోపించారు.

అటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యలపై గుదిబండ మోపిందని పలువురు అభిప్రయాపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News