Big Stories

Kamal Haasan Meets Kallakurichi Victims: కల్తీసారా బాధితులను పరామర్శించిన కమల్ హాసన్!

Kamal Haasan Meets Kallakurichi Victims: తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపిన కల్తీ సారా బాధితులను మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఆదివారం పరామర్శించారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులకు కమల్ భరోసా ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ దుర్ఘటనలో 56 మంది మృతి చెందనట్లు జిల్లా యంత్రాంగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో 216 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్లకురిచ్చి జిల్లాలోని కల్తీ సారా సరఫరా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కరుణాపురం గ్రామానికి చెందిన చిన్నదురై అనే వ్యక్తి కల్తీ లిక్కర్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కల్తీ సారా తాగిన బాధితులు ప్రతి రోజు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ జస్టిస్ గోకుల్ దాస్ కమిషన్ ఘటనపై దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Also Read: అతిషి దీక్షపై ఢిల్లీ బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు

మరో వైపు మూడు నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉంటే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News