Big Stories

JP Nadda: రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా

JP Nadda latest news(Today’s news in telugu): రాజ్యసభ పక్షనేతగా జేపీ నడ్డా నియామకమయ్యారు. పీయూష్ గోయల్ స్థానంలో ఆయనను నియమించారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా కేంద్ర వైద్య శాఖ మంత్రిగా ఇటీవలే ప్రమాణం స్వీకారం కూడా చేశారు.

- Advertisement -

బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నడ్డా పదవీ కాలం ఈ నెలతో ముగియనున్నది. అయితే, ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50 శాతం పూర్తయిన తరువాతనే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబర్ లేదా జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

కాగా, 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో జీపీ నడ్డా 2020లో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో నడ్డా కీలక పాత్ర పోషించారు.

Also Read: ప్రొటెం స్పీకర్ ఎంపిక వివాదం.. పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టిన ఇండియా కూటమి

ఇదిలా ఉంటే.. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నూతనంగా ఎంపికైన ఎంపీలు ప్రమాణం స్వీకారం చేశారు. నేడు కొంతమంది ఎంపీలు ప్రమాణం చేయగా, రేపు మరికొంతమంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీకి చెందిన కేంద్రమంత్రులు రాంమోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ పురందేశ్వరి ప్రమాణం చేశారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ప్రమాణం స్వీకారం చేశారు.

అయితే, ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ను ఎంపిక చేశారు. ఈ ఎంపికపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ నేత కె. సురేశ్ ను ఎందుకు ఎంపిక చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులతో పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. అంతకంటే ముందు పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనం వరకు ర్యాలీ తీశారు. రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకుని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ రాజ్యాంగానికి విలువ ఇవ్వడంలేదన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News