Big Stories

Hemant Soren Granted Bail: భూ కుంభకోణం కేసు.. ఝార్ఖండ్ మాజీ సీఎంకు బెయిల్.. 5 నెలల తర్వాత బయటకు..

Ex-Jharkhand CM Hemant Soren Granted Bail in Land Scam Case: భూ కుంభకోణానిక సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఆ రాష్ట్ర హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమంత్ సోరెన్ బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు. హేమంత్ సోరెన్ దాదాపు 5 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు.

- Advertisement -

అంతకుముందు హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరైనట్లు అతని తరఫు సీనియర్ న్యాయవాది అర్నవ్ చౌదరి తెలిపారు. ప్రాథమికంగా సోరెన్ నేరానికి పాల్పడలేదని కోర్టు పేర్కొన్న విషయాన్ని మీడియాకు వివరించారు అర్నవ్ చౌదరి. బెయిల్‌పై బయటకు వచ్చినా సోరెన్ మరోసారి అలాంటి నేరం చేసే అవకాశం లేదని కోర్టు తెలిపినట్లు చౌదరి స్పష్టం చేశారు.

- Advertisement -

కాగా విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది ఎస్ వీ రాజు సోరెన్ బెయిల్‌పై విడుదలైతే మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడతారని.. అందుకే బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

ఝార్కండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు జస్టిస్ రోంగోన్ ముఖోపాధ్యాయతో కూడిన సింగిల్ బెంచ్ 50 వేల రూపాయల బెయిల్ బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

కాగా గురువారం రాంచీలోని స్పెషల్ కోర్టు హేమంత్ సోరెన్ జుడీషిల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించింది. కస్టడీ పొడిగించిన తర్వాతి రోజే హేమంత్ సోరెన్‌కు హై కోర్టు బెయిల్ మంజూరు చేయడం విశేషం.

8.36 ఎకరాల భూమికి సంబంధించిన భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సోరెన్‌ను జనవరి 31న అరెస్ట్ చేసింది. కాగా అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ విధేయుడిగా ఉంటున్న చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read: భూకుంభకోణం కేసు.. ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో షాక్..

హేమంత్ సోరెన్‌కు బెయిల్ రావడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీదీ ఎక్స్ వేదికగా స్పందించారు. హేమంత్ సోరెన్ ముఖ్యమైన గిరిజన నాయకుడ.. ఇక్క కేసు కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని.. కానీ ప్రస్తుతం గౌరవంగా హై కోర్టునుంచి బెయిల్ పొందారని దీదీ ట్వీట్ చేశారు.

హేమంత్ సోరెన్‌కు బెయిల్ రావడం పట్ల సంతోషంగా ఉన్నానని.. అతను ప్రజా కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తారని అనుకుంటున్నాని దీదీ తెలపారు. జైలు నుంచి బయటకు వస్తున్న హేమంత్ సోరెన్‌కు స్వాగతమంటూ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News