Big Stories

JEE Aspirant suicide at Kota: కోటాలో వరుస ఆత్మహత్యలు.. బీహార్ విద్యార్థి సూసైడ్

JEE Aspirant suicide at Kota: రాజస్థాన్‌లోని కోటాలో ఏం జరుగుతోంది? ఎందుకు విద్యార్థులు ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారు? విద్యార్థులపై కోచింగ్ సెంటర్లు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయా? టెన్షన్‌ తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తాజాగా బీహార్‌కు చెందిన జేఈఈ స్టూడెంట్ ఒకరు సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

- Advertisement -

అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-జేఈఈకు సిద్ధమవుతున్నారు స్టూడెంట్. దేశవ్యాప్తంగా చాలామంది స్టూడెంట్స్ లాంగ్‌టర్మ్ తీసుకుంటున్నారు. అలాంటి వారిలో బీహార్‌లోని నలందా జిల్లాకు చెందిన 16 ఏళ్ల సందీప్‌కుమార్ కుర్మీ. ఐఐటీ కోచింగ్ నిమిత్తం రాజస్థాన్‌ కోటాలోకి ఓ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు.

- Advertisement -

హాస్టల్‌లో కాకుండా పెయిన్ గెస్ట్‌గా వసతి గృహంలో ఉంటున్నాడు సందీప్‌కుమార్. ఏం జరిగిందో తెలీదు గానీ తన రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అదే రూమ్‌లో ఉంటున్న తోటి ఫ్రెండ్స్ పలుమార్లు తలుపు కొట్టినప్పటికీ తీయలేదు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వచ్చి తలుపు బద్దలుకొట్టి తెరచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.

ALSO READ:  నీట్‌ పరీక్ష రద్దు చేయొద్దని కోర్టు మెట్లు ఎక్కిన ర్యాంకర్లు

అయితే ఆత్మహత్యకు సంబందించి ఎలాంటి కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వెంటనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సందీప్ పేరెంట్స్‌కు కబురు పెట్టారు. సందీప్ ఐఐటీ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు.

గత నెలలో ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గతేడాది దాదాపు 27 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. కోటాలో కోచింగ్‌కు వెళ్లిన చనిపోతున్న విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది.

ఐఐటీ, నీట్‌కు కోచింగ్ కేరాఫ్‌గా మారింది రాజస్థాన్‌లోని కోటా ప్రాంతం. ఇక్కడ బిజినెస్ మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కేవలం స్టూడెంట్స్ ద్వారా ఏటా 10 వేల కోట్ల బిజినెస్ సాగుతున్నట్లు పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు రాజస్థాన్ ప్రభుత్వం గతేడాది చర్యలు చేపట్టింది. అయినప్పటికీ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News