Big Stories

Nitish Kumar repeats special status demand: నితీష్ ఆధ్వర్యంలో జేడీయూ కీలక భేటీ.. మరోసారి తెరమీదకు స్పెషల్ స్టేటస్..

Nitish Kumar repeats special status demand For Bihar: బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి స్పెషల్ స్టేటస్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో శనివారం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది.

- Advertisement -

నితీష్ కుమార్ మరోసారి తెరమీదకు ప్రత్యేక హోదా అంశం కోసం పిలుపునివ్వడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో 12 ఎంపీ సీట్లు కలిగిన జేడీయూ కీలక పాత్ర పోషించింది.

- Advertisement -

నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రులు, జేడీయూ నేతలలో సహా అన్ని పార్టీల ఎంపీలు, జేడీయూ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జేడీయూ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా వర్కింగ్ ప్రెసిండెంట్‌గా ఎన్నికయ్యారు.

బీహార్ వాసులకు చిరకాల డిమాండ్‌గా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలని నిర్ణయించినట్లు జేడీయూ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఈ కార్యవర్గ సమావేశంలో సమర్పించిన రాజకీయ ప్రతిపాదనలో ఈ డిమాండ్‌ను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని కూడా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గతేడాది బీహార్ కేబినెట్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఇవాళ మరోసారి స్పెషల్ స్టేటస్ అంశం వార్తల్లో నిలిచింది.

సమావేశానంతరం జేడీయూ సీనియర్‌ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ, “బీహార్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మా పాత డిమాండ్‌, అది ఇప్పటికీ అలాగే ఉంది. సమీప భవిష్యత్తులో, లోక్‌సభ, రాజ్యసభలోని పార్టీ నాయకులు సహా మా నాయకులు లల్లన్ సింగ్, సంజయ్ ఝా ప్రధానమంత్రితో సమావేశమై తమ అభిప్రాయాలను గట్టిగా తెలియజేస్తారు.” అని అన్నారు.

సీఎం నితీష్ కుమార్‌తో సహా బీహార్ రాజకీయ నాయకులు రాష్ట్ర ఆర్థిక వెనుకబాటు, స్థితిగతులను పేర్కొంటూ చాలా కాలంగా ప్రత్యేక హోదా కోసం వాదిస్తున్నారు. ఇదే జరిగితే కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడిలో రాష్ట్ర వాటా పెరుగుతుంది.

Also Read: ప్రధాని పదవి ఇస్తామన్నా వద్దంటున్న నితీశ్.. కారణం ఇదేనా..?

కులగణన చేసిన తర్వాత బీహార్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు 65 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది,. కానీ ఆ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని బీహార్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

అటు 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ పార్టీ మరోసారి ప్రత్యేక కేటగిరీ హోదా అంశాన్ని తెరమీదకు తీసుకురావడం వెనుకు రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News