Big Stories

Nitish Kumar: ప్రధాని పదవి ఇస్తామన్నా వద్దంటున్న నితీశ్.. కారణం ఇదేనా..?

Nitish Kumar: పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధిక సీట్లు సాధించింది. ఆదివారం మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటు ఇండియా కూటమి కూడా చాపకింద నీరులా పావులు కదుపుతుంది. కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసేందుకు పలువురు నేతలకు పలు పదవులు కూడా ఆఫర్ చేసిందంటా. అయినా కూడా వాళ్లు అంగీకరింలేదని తెలుస్తోంది. ఈ విషయమై జీడీయూ వర్గాలు తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని.. అయినా కూడా నితీశ్ ఆ ఆఫర్ ను తిరస్కరించారని జేడీయూ పార్టీకి చెందిన నేత కేసీ త్యాగి ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

- Advertisement -

‘ఇండియా కూటమి నితీశ్ కుమార్ కు ప్రధాని పదవి ఆఫర్ చేసింది. అయినా కూడా నితీశ్ ఆ ఆఫర్ ను తిరస్కరించారు. ఈ విషయమై పలువురు అగ్ర నేతలు నితీశ్ ను కలిసేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతమైతే మేం ఎన్డేఏ కూటమితో ఉన్నాము. ఇప్పుడు మళ్లీ వెనక్కి తిరిగి చూడబోము’ అంటూ కేసీ త్యాగి అన్నారు.

- Advertisement -

ఫలితాల కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అందులో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. అయితే, ఆ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి 293 సీట్లు వచ్చాయి. ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఎగ్జిట్ అంచనాలకు మించి ఇండియా కూటమి అధిక స్థానాలను కైవసం చేసుకుంది.

ఈ క్రమంలో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు టీడీపీని కూటమి నేతలు సంప్రదించి పదవులు ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నితీశ్ కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందంటూ త్యాగి వ్యాఖ్యలు చేశారు.

Also Read: లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ..తీర్మానించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

అయితే, త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. త్యాగి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నది. అలాంటిదేమీ లేదంటూ కాంగ్రెస్ అగ్రనేత వేణుగోపాల్ బదులిచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News