Big Stories

Jairam Ramesh: నీట్ వివాదంపై స్పందించిన జైరాం రమేష్.. మోదీ సర్కార్‌పై ఫైర్

Jairam Ramesh: నీట్ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. నీట్ అక్రమాలపై విద్యార్థులు ఆందోళనతో నిరసన బాట పట్టారని అన్నారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ కేంద్రంగా ఎడ్యుకేషన్ స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలేనని అన్నారు.

- Advertisement -

నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు భరోసా ఎవరని ప్రశ్నించారు. ఈ సందరర్భంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఏజెన్సీలో నియమకాల కోసం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని నెలకొల్పుతామని మోదీ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఏజెన్సీ ద్వారా ఒక్క నియామకం చేపట్టలేదని పేర్కొన్నారు. తాము నీట్‌కు వ్యతిరేకం అని తమిళనాడు, మహారాష్ట్ర చెబుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ వేదికగా నీట్‌పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నీట్ నిర్వహణలో ఎన్డీఏ, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయని జైరాం రమేష్ ఆరోపించారు.

- Advertisement -

వలసల అంశంపై కూడా జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత మూడేళ్లలో 17 వేల మందికి పైగా మిలియనీర్లు భారత్‌ను విడిచి పెట్టారని అన్నారు. ఆ వ్యక్తుల సంపద ఒక మిలియన్ డాలర్లకు పైగా ఉందన్నారు. పన్ను విధానంతో పాటు ఏకపక్ష పన్నుల కారణంగా 10 ఏళ్లలో మిలియనీర్లు భయం, బెదిరింపులను ఎదుర్కుంటున్నారని తెలిపారు. భరత్‌కు చెందిన వ్యాపార వేత్తలు దేశం విడిచి సింగపూర్, యూఏఈ, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారని అన్నారు.

Also Read:  తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. నీట్ పేపర్ లీకేజీకి కారణం ఆయనే..

మిలియనీర్ల వలసలు ఆందోళనను కలిగిస్తున్నాయని చెప్పారు. మిలియనీర్ల వలసల విషయంలో చైనా, బ్రిటన్‌ల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. మోదీ ప్రభుత్వ పన్ను విధానంపై జైరాం రమేష్ మండిపడ్డారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News