Big Stories

International Yoga Day: ఆసనాలు వేసిన మోదీ..శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగా వేడుకలు

PM Modi Yoga Day Celebrations: విదేశాల్లోనూ యోగాకు ప్రాధాన్యత పెరిగిందని, యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించిన తర్వాత మార్పు మొదలైందని తెలిపారు.

- Advertisement -

శ్రీనగర్‌లోని దాల్ సరస్స సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు. దేశ వ్యాప్తంగా యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. వాస్తవానికి ప్రధాని 7 వేలమందితో కలిసి ఆసనాలు వేయాల్సి ఉండగా.. వర్షం కారణంగా అప్పటికప్పుడు వేదికను షేర్ ఏ కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. దీంతో ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.

- Advertisement -

యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై కొందరితో సరదాగా ముచ్చిటించారు. ఆ తర్వాత మోదీ ప్రజలతో సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలను స్వయంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేవారు.ఈ ఫోటోలతోపాటు ‘ శ్రీనగర్‌లో యోగాసనాలు వేసిన తర్వాత దిగిన సెల్ఫీలు, దాల్ సరస్సు వద్ద అసమాన్యమైన చైతన్యం కనిపించింది.’ అని రాసుకొచ్చారు.

యోగా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులతో సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రులు జైశంకర్, బీఎల్ వర్మ, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, హెచ్ డీ కుమార స్వామి, కిరన్ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News