Big Stories

International Yoga Day 2024: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. శ్రీనగర్ లో ప్రధాని మోదీ

International Yoga Day 2024 PM Modi To Perform Yoga Near Dal Lake In Srinagar:
యోగా.. ఒంటికి మంచిదేగా! నిజమే.. యోగా శరీరానికే కాదు, మనసుకు కూడా మంచిదే. అందుకే మన భారత ప్రధాని నరేంద్రమోదీ యోగాకు ఎంతో విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జూన్ 21న ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభమైంది.

- Advertisement -

ప్రధాని మోదీ కృషి ఫలితంగా  ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) జనరల్ అసెంబ్లీలో 2014లో చేసిన ప్రసంగంలో యోగాను గుర్తుచేసుకోవడానికి ప్రపంచ దినోత్సవాన్ని నియమించాలని ప్రధాని మోదీ సూచించారు. UN జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 2014లో జూన్21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈసారి ప్రధాని జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉండటం వల్ల  శ్రీనగర్ లో జరిగే యోగా దినోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రపంచ శ్రేయస్సు వేడుకగా జరుపుకుంటారు. యోగా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే.. ప్రాచీన భారతీయ యోగా కళను గుర్తు చేసుకుంటూ.. శారీరక సమస్యలు మానసిక, మస్యలు తొలగిపోతాయని ఆద్యాత్మక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఈ యోగా దినోత్సవాన్ని జరుకుంటారు. ఒత్తిడి..ఆందోళనలను దూరంచేసే దివ్యౌషధం. యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, మానసిక ఆందోళన తొలగిపోతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్, అన్నిపార్టీలకు చెందిన..

ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక పరిమితమైన థీమ్ ని ఎన్నుకుంటారు. ఈ సంవత్సరానికి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న థీమ్ ని తీసుకొచ్చారు. అంటే యోగా “మన కోసం.. మన సమాజం కోసం” అనే థీమ్ తో ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడు యోగా సాధన చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను కలుగుతాయని అర్ధం. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్ లోని డాల్ సరస్సు ఒడ్డునున్న షేర్-ఏ-కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News