Big Stories

India Alliance on NEET: నీట్‌పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్

India Alliance on NEET: పార్లమెంట్‌లో నీట్ పరీక్ష అంశంపై చర్చ జరపాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఒక వేళ చర్చకు అనుమతి ఇవ్వకపోతే, సభలో నిరసనలు తెలిపేందుకు నిర్ణయించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఇంట్లో గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చల్లో కూడా పాల్లొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు.

- Advertisement -

ప్రతి పక్షాలంతా ఐక్యంగా ఉన్నాయని సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రీయ లోక్ తంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ తెలిపారు. పార్లమెంట్‌లో నీట్, అగ్నివీర్, ద్రవ్యోర్బణం, నిరుద్యోగం అంశాలపై చర్చలకు డిమాండ్ చేయనున్నామని చెప్పారు. ఇండియా కూటమి సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. నీట్ అంశంపై పార్టమెంట్ లో నోటీసులు ఇస్తామని అన్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం నీట్, ఇతర పబ్లిక్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సిద్ధంగ ఉన్నారని ఎన్డీఏ కూటమి వర్గాలు తెలిపాయి. గురువారం పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మాట్లాడుతూ ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ ఘటనలపై న్యాయపరమైన విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పార్టీలకు అతీతంగా, దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Also Read: నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభం.. బీహార్‌లో ఇద్దరిని..

రాష్ట్రపతి ప్రసంగానికి ఖర్గే స్పందించారు. మోదీ ప్రభుత్వం వ్రాసిన రాష్ట్రపతి ప్రసంగం వింటుంటే నీట్ సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టేలా కనిపించడం లేదన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్టీఏ నిర్వహించిన 66 రిక్రూట్ మెంట్ పరీక్షల్లో 12 పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. దీంతో 75 లక్షల మంది యువత నష్టపోయారని అన్నారు. తమకు న్యాయం చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించే విధంగా రాష్ట్రపతి ప్రసంగం లేదని ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News