Big Stories

Specialities of Prachand : ప్రచండ్ స్పెషాలిటీ ఇదే.. ఈ విషయాలు మీకు తెలుసా ?

Specialities of Prachand(Latest telugu news): ప్రచండ్.. ఇండియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లోని అమ్ములపొదిలో ఉన్న అత్యంత నమ్మకమైన లైట్ కొంబాట్ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్‌కు ప్రచండ్ అనే నామకరణం ఊరికే చేయలేదు. దానికి అన్ని శక్తిసామర్థ్యాలు ఉన్నాయి కాబట్టే ఆ పేరు వచ్చింది. ఇంతకీ ఈ ప్రచండ్ హెలికాప్టర్‌ విశేషాలేంటి ? అసలు ఉన్నట్టుండి మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం. అత్యంత క్లిష్టమైన వాతావరణంలో కూడా సేవలందించడం. యుద్ధట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లు ఇలా టార్గెట్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ అక్యూరసీతో నేలకూల్చడం ఈ హెలికాప్టర్ల స్పెషాలిటీ. అందుకే ఇండియన్ డిఫెన్స్‌ మినిస్ట్రీ వీటిపై ఫోకస్ చేసింది. ఏకంగా 156 హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 90 ఇండియన్ ఆర్మీ కోసం కాగా.. మరో 66 ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కోసం.. అందుకే మనం ఇప్పుడు దీనిపైన చర్చించుకుంటున్నాం.

- Advertisement -

ఏముంది ఇందులో అనకండి.. చాలా ఉంది. మన దేశంలోనే.. మనం డెవలప్‌ చేసిన టెక్నాలజీతో.. పూర్తిగా.. పూర్తిగా మనమే డెవలప్‌ చేసిన హెలికాప్టర్ ఇది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. ఇలాంటి హెలికాప్టర్‌ ప్రపంచంలో మరెక్కడా లేదు. యస్.. ఇది పూర్తిగా నిజం. ప్రచండ్ లాంటి హెలికాప్టర్‌ ఇంత వరకు ఏ దేశం కూడా తయారు చేయలేదు. అమెరికా కావొచ్చు.. రష్యా, చైనా కావొచ్చు. ఏ దేశం కూడా ఇలాంటి LCHను తయారు చేయలేదు. భూమికి 5 వేల మీటర్ల ఎత్తు.. అంటే 16 వేల 400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ అండ్ టేకాఫ్‌ అయ్యే హెలికాప్టర్‌ ఇదొక్కటే. ఇప్పటి వరకు ఈ రికార్డ్‌ను ఏ దేశం కూడా బీట్‌ చేయలేకపోయింది. అలాంటి హెలికాప్టర్‌ను డిజైన్ చేసి.. గాల్లోకి ఎగిరేలా చేసింది హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్. అందుకే మళ్లీ అదే HALకి 156 హెలికాప్టర్ల కోసం ఆర్డర్‌ ఇచ్చింది రక్షణ శాఖ.

నిజానికి ఇలాంటి హెలికాప్టర్ల అవసరం మనకు ఉందని తెలిసింది కార్గిల్ యుద్ధ సమయంలో.. ఆ టైమ్‌లో మన భూభాగంలోకి చొరబడి కొండలపై తిష్ట వేసిన పాక్‌ సైనికులను తరిమికొట్టేందుకు.. చాలా కష్టపడాల్సి వచ్చింది. మూడు నెలల సమయంలో ఏకంగా 527 మంది సైనికులు అమరులయ్యారు. అప్పుడే ఇండియన్‌ ఆర్మీ గుర్తించింది లైట్ కాంబాట్‌ అటాక్ హెలికాప్టర్ల గురించి.. సరిహద్దుల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మన దగ్గర హెలికాప్టర్లు లేవని.. అప్పటికప్పుడు కొన్ని మాడిఫికేషన్స్‌తో కొన్ని హెలికాప్టర్లను రంగంలోకి దించినా.. అనుకున్నంత సక్సెస్‌ కాలేదు ఇండియన్ ఆర్మీ. అప్పటి నుంచి వీటి తయారీపై ఫోకస్‌ చేసిన రక్షణశాఖ.. ఎట్టకేలకు 2022లో వీటిని ఆర్మీలోకి ఇన్‌క్లూడ్ చేయగలిగింది. ఇవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాయి. సియాచిన్ గ్లేసియర్‌లో ల్యాండింగ్ అండ్ టేకాఫ్‌ అయిన మొదటి హెలికాప్టర్ ప్రచండ్.

అత్యంత ఎత్తైన ప్రదేశాలు, అనుకూలంగా లేని వాతావరణంలో కూడా శత్రువుల వెన్నులో పుట్టించగలవు. వీటి బరువు కేవలం 5.8 టన్నులు మాత్రమే. ఎయిర్‌ టు ఎయిర్‌.. అండ్ ఎయిర్‌ టు సర్ఫేస్‌ మిసైల్‌ లాంచర్స్. 20 ఎంఎం టర్రెంట్ గన్స్.. రాకెట్ లాంచర్స్‌. అత్యాధునిక సెన్సార్ వ్యవస్థ.. డ్యూయల్ ఇంజిన్‌. 268 కిలోమీటర్ల టాప్ స్పీడ్. ఆకాశంలో ఆరున్నర కిలోమీటర్ల ఎత్తులో కూడా చక్కర్లు కొట్టే సామర్థ్యం. ఇలా అనేక ప్రత్యేకతల సమాహారం ప్రచండ్.

ఇప్పటి వరకు ఇండియన్‌ ఆర్మ్‌డ్ ఫోర్సేస్‌ వద్ద కేవలం 15 మాత్రమే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ వద్ద 10.. ఇండియన్‌ ఆర్మీ వద్ద ఐదు. వీటి సామర్థ్యానికి ఫిదా అయినా రక్షణ శాఖ వెంటనే మరో 156 హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ డీల్ విలువ 50 వేల కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే HALకు ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది.

HAL కూడా ఈ డీల్‌తో మరో మెట్టు ఎక్కినట్టే. ఎందుకంటే ఏప్రిల్‌లో కేంద్రం 65 వేల కోట్ల డీల్‌ చేసుకుంది HALతో. 97 ఫైటర్‌ జెట్స్‌ తయారీకి ఆర్డర్‌ ఇచ్చింది. ఇప్పుడు మరో 50 వేల కోట్ల డీల్‌ దక్కించుకుంది. దీంతో HAL షేర్ ధర కూడా ఏకంగా 5 శాతం పెరిగింది. నిజానికి లాస్ట్ సిక్స్‌ మంత్స్‌లో ఈ షేర్‌ ధర 93 శాతం పెరిగింది. ఇక ఏడాదిగా చూసుకుంటే 179 శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 3.64 లక్షల కోట్లుగా ఉంది. రానున్న రోజుల్లో ఈ షేర్‌ ధర మరింత పెరిగే చాన్స్ కనిపిస్తోంది. సో.. ప్రచండ్ శత్రు దేశాలపైనే కాదు.. స్టాక్‌ మార్కెట్‌పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News