Big Stories

Heatwave: ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. వడదెబ్బకు ఏడుగురు మృతి

Delhi Heatwave: ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో బుధవారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలుల తీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో ఏడుగురు మృతి చెందగా మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటగా ఎండ వేడిని తట్టుకోలేక ఢిల్లీ వాసులు ఆసుపత్రుల పాలవుతున్నారు. మే 27 నుంచి జూన్ 19 వరకు సుమారు 45 మంది రామ్ మనోహర్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజుల్లోనే 22 మంది అడ్మిట్ కాగా వడ దెబ్బ వల్ల ఏడుగురు మృతి చెందినట్లు ఆసుప్రతి సూపరింటెండెంట్ అజయ్ శుక్లా తెలిపారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో కూలీలుగా పనిచేసే వారే ఎక్కువగా ఆసుప్రతిలో చేరుతున్నట్లు వెల్లడించారు. వడదెబ్బకు గురైన వారు ఆలస్యంగా ఆసుపత్రిలో చేరుతుండటం మరణాలకు కారణమని తెలిపారు.

- Advertisement -

Also Read: నీట్ వివాదంపై కాంగ్రెస్ ఆగ్రహం.. జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు

ఉత్తరాదిలో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎండల వల్ల హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వడదెబ్బ ప్రభావిత రోగులకు ప్రాధాన్యత ఇచ్చి చికిత్స అందిచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా సూచనలు జారీ చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News