Big Stories

Heavy Rains: బెంగళూరులో భారీ వర్షం(వీడియో).. 133 ఏళ్ల రికార్డు బ్రేక్!

Heavy Rainfall: కర్ణాటకలోని బెంగళూరు నగరం మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా అక్కడ భారీ వర్షం కురిసింది. నగరంలో ఆదివారం ఒక్కరోజే భారీ వర్షపాతం నమోదు అయ్యింది. 111 మీ. మీ. వర్షపాతం బెంగళూరులో నమోదైంది. జూన్ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయిలో వర్షం కురవడం 133 ఏళ్లలో ఇదే మొదటిసారి అంటూ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

జూన్ 1, 2వ తేదీల్లో కలిపి మొత్తం 140.7 మీ.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో ఏటా జూన్ మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని(110.3 మీ.మీ.) ఇప్పటికే దాటేసినట్లు అధికారులు తెలిపారు. నగరంలో చివరిసారిగా 1891, జూన్ 16న ఆ నెలకు సంబంధించి రోజువారీ అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు సమాచారం.

- Advertisement -

అయితే, గత కొద్ది రోజుల నుంచి బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో జల సంక్షోభాన్ని ఇటీవల ఎదుర్కొన్నది. దీంతో నీటివృథా చేసేవారిని కట్టడి చేసేందుకు అధికారులు జరిమానాలు కూడా విధించారు. ఈ క్రమంలో బెంగళూరు నగరంలో భారీ వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని అధికారులు తెలిపారు.

దక్షిణ కన్నడ, హవేరి, బళ్లారి, ఉడిపి, బెంగళూరు, మైసూరు తదితర జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేసినట్లు వారు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఆదివారం సాయంత్రం లోగా తెలియజేయాలి.. లేదనుకో..

కాగా, భారీ వర్షాలు కురువడంతో బెంగళూరులో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లు చెరువులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి. వరద నీరు రోడ్లపైకి రావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో సంబంధింత విభాగాల సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి, వాటిని తొలగించారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News