Big Stories

Sikkim Rains : సిక్కింలో భారీ వర్షం.. వరదల్లో చిక్కుకుపోయిన 1200 మంది టూరిస్టులు

Sikkim Rain news today(Live tv news telugu): సిక్కింలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు. నార్త్ సిక్కింలో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తీస్తాలో వరదలు సంభవించడంతో.. 1200 మంది స్వదేశీ, విదేశీ పర్యాటకులు లాచుంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయారు. వర్షాలు తగ్గుముఖం పట్టి.. వాతావరణం అనుకూలించాక పర్యాటకులను తరలించే ఏర్పాట్లు చేస్తామని స్థానిక అధికారులు తెలిపారు.

- Advertisement -

పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడటంతో.. ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరి నీటమునిగాయి. ఇక భారీ వర్షాలు, వరదలు కొట్టుకుపోయిన, డ్యామేజ్ అయిన రోడ్ల మరమ్మతులకు కనీసం 5-6 రోజుల సమయం పడుతుందన్నారు. ఇప్పటి వరకూ సిక్కింలో వర్షాల కారణంగా ఆరుగురు మరణించారని, వారిలో ముగ్గురి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయని పేర్కొన్నారు.

- Advertisement -

Also Read : బెంగళూరులో భారీ వర్షం(వీడియో).. 133 ఏళ్ల రికార్డు బ్రేక్!

సంక్లాంగ్ లోని వంతెన వరదనీటిలో కొట్టుకుపోవడంతో.. చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో చిక్కుకున్న పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లను వీలైనంత త్వరగా మరమ్మతు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News