Big Stories

Donald Trump Arrested : డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. ఎందుకంటే..?

Donald trump news today(Telugu news updates) :

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టు అయ్యారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలపై ఆయనపై కేసు నడుస్తోంది. ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకోవడం, కుట్ర పాల్పడ్డారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది.

- Advertisement -

జార్జియా జైల్‌ వద్ద పోలీసుల ఎదుట డోనాల్డ్ ట్రంప్ లొంగిపోయారు ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లారు. రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఫాని విల్లీస్‌ అనుమతి ఇచ్చారు ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్‌ జైలుకు వెళ్లారు. ట్రంప్‌పై 4 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక కేసులో తాజా ట్రంప్‌ జైలులో 20 నిమిషాలపాటు ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చారు.

- Advertisement -

అమెరికాలో ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా దాన్ని అరెస్టుగానే పరిగణిస్తారు. కొన్ని రోజుల కిందట కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన మరో కేసులో ట్రంప్‌ అరెస్టయ్యారు.తనపై మోపిన అభియోగాలు అవాస్తవాలని ట్రంప్ పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News