Big Stories

EVM Hacking Issue: నిజంగా ఈవీఎంలను హ్యక్ చేయవచ్చా..? మధ్యలో మస్క్ పంచాయితీ ఏంటీ..?

- Advertisement -

కాని లెటెస్ట్‌గా.. గట్టిగా ప్రజల్లో చర్చ నడిచేందుకు కారణం శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్‌ పండిల్కర్ ఫోన్.. అవును.. ఆ ఫోన్‌ వల్లే ఇప్పుడు మనం ఈ టాపిక్‌పై డిస్కస్ చేసుకుంటున్నాం. ఇదంతా జరిగింది కౌంటింగ్‌ రోజు.. ఆ రోజు ఏం జరిగిందంటే.. కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంను అన్‌లాక్ చేసేందుకు ఈ పండిల్కర్ ఫోన్‌ను ఎలక్షన్ కమిషన్ సిబ్బంది ఒకరు ఉపయోగించారు. ఆ ఫోన్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్.. అంటే ఓటీపీని యూస్ చేసి ఈవీఎంను తెరిచారు. ఇదీ కౌంటింగ్‌ రోజు వచ్చిన ఆరోపణలు.. అయితే ఈ ఎన్నికల్లో రవీంద్ర వైకర్ జస్ట్ 48 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. అందుకే ఈవీఎం హ్యాక్‌ అయ్యిందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఈవీఎంను హ్యాక్‌ చేయవచ్చనే ప్రచారం మొదలైంది.

- Advertisement -

ఈ పంచాయితీ ఇలా నడుస్తున్న సమయంలో ప్రపంప కుబేరుడు, వ్యాపారవేత్త అయినా ఎలాన్‌ మస్క్‌ ఓ కామెంట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చు.. AI సాయంతో ఆ పనిని చాలా ఈజీగా చేయవచ్చంటూ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. మరి మస్క్‌కు నిజంగా ఈవీఎంల గురించి తెలిసి అన్నారో లేక తన కంపెనీని ఇండియాలో లాంచ్‌ చేయడానికి ఎక్కువ కండిషన్లు పెడుతున్నారన్న కోపంతో అన్నారో తెలియదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. నిజాకికి మస్క్‌ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరికోలో జరిగిన ఎలక్షన్స్‌కు సంబంధించి చేసినట్టు కనిపిస్తుంది. అసలు ఈవీఎంలను తొలగించి పేపర్ బ్యాలేట్‌లను తిరిగి తీసుకురావాలన్నారు.

Also Read: లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ తప్పదా, డిప్యూటీపై కన్నేసిన ఇండియా కూటమి

ఓ వైపు హ్యాకింగ్ ఆరోపణలు.. మరోవైపు మస్క్‌ వ్యాఖ్యలు.. ఇంకేముంది రచ్చ మొదలైంది. అసలు హ్యాకింగ్‌ వల్లే బీజేపీ గెలిచిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దేశ ప్రజలకు ఎలక్షన్ కమిషన్‌ సమాధానం చెప్పాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలపై కామెంట్స్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాలోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌ల లాంటివి వాటిని పరిశీలించడానికి ఎవరినీ అనుమతించరు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఈవీఎంలపై ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

అయితే దీనిపై బీజేపీ నేతల వర్షన్ మాత్రం మరోలా ఉంది. అసలు ఈవీఎం అనేది ఏ డివైజ్‌తో కనెక్ట్ అయ్యి ఉండదంటున్నారు. ఈ విషయం కాంగ్రెస్‌ నేతలకు కూడా తెలుసని. కానీ ప్రజలను కావాలనే కన్‌ఫ్యూజ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ గెలిచిన చోట్లలో ఈవీఎంలు బాగా పనిచేశాయి. ఓడిన చోట మాత్రమే హ్యాక్‌ అయ్యాయా? అంటూ రివర్స్‌ అటాక్ చేస్తున్నారు.

ఇవీ పార్టీల వాదనలు.. ఎవరి వాదన వారిదే.. కానీ ఎలక్షన్‌ కమిషన్‌ ఏం చెబుతుంది? ఈవీఎంలపై వారి మాట ఏంటి? మహారాష్ట్రలో వచ్చిన ఈవీఎం హ్యాక్‌పై ఈసీ స్పందించిందా? ఇలా అనేక ప్రశ్నలు. కానీ వీటికి సమాధానం ఇచ్చింది ఎన్నికల కమిషన్.. ఈసీ చెబుతున్నది ఏంటంటే.. ఈవీఎం అనేది.. స్టాండ్ అలోన్ డివైజ్.. అంటే ఎలాంటి నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యి ఉండదు. సో బయటి నుంచి ఏ విధంగా ఆ ప్రొగ్రామ్‌ను డిస్టర్బ్‌ చేయలేరు. ఏం చేసినా ఫిజికల్‌గానే చేయాలి. అలా చేయాలంటే ఈసీ సిబ్బంది, పార్టీ నేతలు, ఏజెంట్ల ముందే చేయాలి. అలా చేయడం కుదరదు కాబట్టి ఈవీఎం హ్యాక్‌ అనేది రాజకీయ విమర్శలు చేసుకోవడానికి తప్ప దేనికి పనికి రాదని ఈసీ చెబుతుంది.

Also Read: Nitish Kumar: రాజకీయాల్లోకి బిహార్ సీఎం కుమారుడి ఎంట్రీ ఖాయమైనట్లేనా?

మరి మస్క్‌ చేస్తున్న ఆరోపణల మాటేంటి? నిజానికి అమెరికా, మరికొన్ని దేశాల్లో వాడే ఈవీఎంలు వేరు. మన ఇండియాలో ఉపయోగించే ఈవీఎంలు వేరు. ఎందుకంటే అమెరికాలో కంప్యూటర్ ప్లాట్‌ఫామ్స్‌ను వాడి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంలను తయారు చేస్తారు. వీటిని రీప్రోగ్రామ్‌ చేసే చాన్స్ ఉంది. కానీ అది కూడా చాలా చాలా కష్టం.. కానీ ఇండియాలో వాడఈవీఎంలు.. ఏ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యి ఉండవు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉండదు. రీ ప్రొగ్రామ్‌ చేసే అవకాశమే ఉండదు.

అయితే ఈ విషయాలను ఎలక్షన్‌ కమిషన్‌ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. మరి ఏకపక్షంగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్లడం కంటే.. ప్రజలకు క్లారిటీ ఇస్తేనే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు వృథా కావడం లేదన్న ఫీల్ ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News