Big Stories

Priyanka Gandhi on NEET Paper: మాఫియా చేతుల్లో విద్యా వ్యవస్థ: ప్రియాంక గాంధీ!

Priyanka Gandhi on NEET Paper Leak: నీట్, యూజీసీ నెట్ సహా జాతీయ పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు కారణం మోదీ సర్కార్ అంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను మాఫియా, అవినీతిపరులకు అప్పగించిందని మండిపడ్డారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయని.. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని ప్రియాంక గాంధీ అన్నారు.

- Advertisement -

దేశ విద్యావ్యవస్థ, పిల్లల భవిష్యత్తు అత్యాశాపరులకు అప్పగించారని మండిపడ్డారు. రాజకీయ నేతల దురహంకారం వల్లే పేపర్ లీక్‌లు, పరీక్ష రద్దులు జరుగుతున్నాయని అన్నారు. మోదీ పాలనలో క్యాంపస్ ల నుంచి విద్య మాయం అవుతుందని ద్వజమెత్తారు. రాజకీయ గుండాయిజం విద్యా వ్యవస్థకు గుర్తింపుగా మారిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేదని మండిపడ్డారు. యువత భవిష్యత్తుకు బీజేపీ అడ్డంకిగా మారిందన్నారు. దేశంలోని సమర్థులైన యువత వారి విలువైన సమయాన్ని, బీజేపీపై పోరాడేందుకు వృథా చేస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ మోదీ స్పందించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Also Read: మరోసారి మేనల్లుడికే పట్టం.. మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్.. 

జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడుతుండటంతో ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిని మరింత పెంచారు. విద్యార్థుల జీవితంతో బీజేపీ ఆడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ ఆరోపించారు. బీజేపీ పాలనలో పేపర్ లీక్ అవుతున్నా.. ప్రధాని మోదీ మాత్రం స్పందించడం లేదు. ప్రధానిగా నాయకత్వ లక్షణాలను ఆయన కోల్పోయారు. కనీసం పని చేయలేని మంత్రులపై మోదీ చర్యలు తీసుకోలేకపోతున్నారని ఠాగూర్ మండిపడారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News