Big Stories

Delhi Heavy Rains: ఢిల్లీలో 88 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదు.. ఐఎండీ హెచ్చరిక ఇదే..

Delhi Receives Record Breaking Rainfall, Highest in 88 Years: నిన్నటి దాకా ఎండతో అల్లాడిన ఢిల్లీకి వర్ష సూచన హాయిగా అనిపించింది. అయితే, ఆ ఆనందం ఎంతో సమయం లేదు. జూన్ 28న కురిసిన వాన, వరదతో ఢిల్లీ అతలాకుతలం అయ్యింది. అసలు, 88 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం ఎందుకు కురిసింది..? ఢిల్లీపై ప్రకృతి పగబట్టిందా..? రోడ్లపై బోట్లు వేసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది..? దేశ రాజథానిలో ఇంత ఘోరమైన పరిస్థితిని అధికారులు ఎందుకు ముందుగానే అంచనా వేయలేకపోయారు..?

- Advertisement -

ప్రకృతి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. అంచనాలకు మించిన ప్రభావాన్నీ చూపిస్తుంది… దీన్నే కొన్ని నెలలుగా ఢిల్లీ కూడా చవిచూసింది. గత నెలల్లో తీవ్రమైన ఎండలు మండిన ఢిల్లీ నగరంలో వేడి తట్టుకోలేక దాదాపు పాతికమంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండ వేడి మధ్య నీటి ఎద్దడి కూడా ఢిల్లీ ప్రజలకు పీడకలలా మారింది. అయితే, సడెన్‌గా ఢిల్లీకి వర్షం వస్తుందన్న వార్త రాజధాని వాసులకు చల్లని కబురు తెచ్చింది. అయితే, ఈ ఆనందం గంటల వ్యవధిలోనే వర్షం పాలయ్యింది. ఢిల్లీలో వచ్చిన కుంభవృష్టి వానలకు నగరం యావత్తూ అతలాకుతలం అవుతోంది.

- Advertisement -

ఈ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోకి వరదనీరు ఉప్పొంగింది. డ్రైనేజీల నుండి మురుగు నీరు ఇళ్లల్లోకి కూడా చేరింది. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 88 ఏళ్లుగా రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఆ రికార్డును బద్దలు కొడుతూ ఢిల్లీలో ఇప్పుడు భారీ వర్షం నగరవాసులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇన్నేళ్ల నుంచి ఇప్పటికవరకు ఢిల్లీలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని ఐఎండీ పేర్కొంది.  గత 24 గంటల్లో 23 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. జూన్ 27న కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. ఇక, జూన్ 28 వచ్చిన వానా వరదకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. కొంతమంది ప్రాణాలు కూాడా కోల్పోయారు. ఇక నగరంలో ఎక్కడ చూసిన కిలోమీటరల్ల దూరంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.

Also Read: ప్రధాని మోదీపై సోనియా కామెంట్స్.. ఓడినా, ఏమాత్రం మారలేదు..

ఇక, ఢిల్లీలో రాబోయే ఏడు రోజుల్లో గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనినతో ఢిల్లీలోని పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. దీని గుసమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఢిల్లీ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. పరిస్థితిపై ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ, చివరి వర్షం వరకు దాదాపు 200 హాట్‌స్పాట్‌లను గుర్తించామని అన్నారు. వీటిలో 40 హాట్‌స్పాట్‌లు పిడబ్ల్యుడి ద్వారా సిసిటివి నిఘాలో ఉన్నాయనీ.. ఢిల్లీలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తే, అది తగ్గడానికి సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం, ఢిల్లీలో కాలువల సామర్థ్యం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News