Big Stories

Delhi Airport A roof collapsed: ఢిల్లీలో భారీ వర్షం, ఎయిర్‌పోర్టులో కూలిన పైకప్పు, ఆరుగురికి గాయాలు

Delhi Airport A roof collapsed: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి. భారీగా వరదనీరు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.

- Advertisement -

ఈ వర్షాలు ధాటికి ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులోని టెర్నినల్ వన్‌లో పైకప్పు కూలిపోయింది. అక్కడే లైనులో ఉన్న కార్లపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

ఈ ప్రమాదంలో పైకప్పు కింద పార్క్ చేసిన అనేక వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టెర్నినల్ -1 వద్ద ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయాలని విమాన సంస్థలకు సూచించారు ఆయన.

ALSO READ: నీట్‌పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్

ఇప్పటివరకు ఎండలతో అల్లాడిన ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. రెండురోజులుగా ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు పోలీసులు కూడా స్థానికులు, వాహన దారులను అలర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News