Big Stories

Stay Continues on Kejriwal Bail: కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశే.. బెయిల్ పిటిషన్ పై స్టే కంటిన్యూ..

Stay Continues on Delhi CM Arvind Kejriwal Bail: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మరికొన్నిరోజులు తీహార్ జైల్లోనే అరవింద్ కేజ్రీవాల్ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించడంతో బెయిల్‌ తీర్పుపై స్టే వచ్చింది. దీంతో కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది.

- Advertisement -

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవలే కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దానిపై ఈడీ అభ్యంతరం చెప్తూ హై కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు స్టే విధించింది. తీహార్ జైలు నుంచి విడుదల కావలసిన కేజ్రీవాల్ కు చివరి నిమిషంలో బిగ్ షాక్ తగిలినట్లైంది. దానిని సవాల్ చేస్తూ.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి తీర్పు రాకుండా తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేసింది.

- Advertisement -

Also Read: Pathankot high alert: పఠాన్‌కోట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ, పోలీసులు హై అలర్ట్

ఈ ఏడాది మార్చి 21న ఢిల్లీ మద్యంకేసులో అరెస్టైన కేజ్రీవాల్ .. 21 రోజుల తర్వాత షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ పై మే 21న విడుదలయ్యారు. జూన్ 2వ తేదీతో గడువు ముగియడంతో మరో వారంరోజులు బెయిల్ ను పొడిగించాలని కోరారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కొట్టివేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. తిరిగి మళ్లీ తీహార్ జైలుకే వెళ్లారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News