Big Stories

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు..

Arvind Kejriwal gets Bail(Telugu news live today): ఢిల్లీ లిక్కర్ పాలసీతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. లక్ష పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు పేర్కొంది.

- Advertisement -

ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు ఆప్ చీఫ్‌కు లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌పై ఉపశమనం కల్పించారు. రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ చేసిన దరఖాస్తుపై ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులు చేసిన వాదనలను విన్న తర్వాత న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

తీహార్ జైలు వర్గాల సమాచారం ప్రకారం, జూన్ 21 శుక్రవారం నాడు కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.

కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌పై 48 గంటల పాటు స్టే విధించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

కేజ్రీవాల్‌ను నేరారోపణలు, సహ నిందితులతో ముడిపెట్టాలని ఈడీ కోరింది. ఈడీ వాదనలు విన్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు ఉత్తర్వులను రిజర్వ్ చేసారు. ఆప్ చీఫ్‌ను నిందించడానికి ప్రాసిక్యూషన్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న అరెస్ట్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ మద్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు.

తాజాగా కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆప్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీ మంత్రి అతిషి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News