Big Stories

Arvind Kejriwal Comments: నేనేం తప్పు చేయలేదు: కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal Said I do Not Done Anything: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తానేం తప్పు చేయలేదని కోర్టుకు తెలిపారు. తన పార్టీ, మనీష్ సిసోడియా కూడా తప్పు చేయలేదని చెప్పారు. తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను బుధవారం కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న సీబీఐ పోలీసులు అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే ఆ సమయంలోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేశానని సీబీఐ చెబుతోందన్న ఆయన.. అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.

- Advertisement -

అనంతరం సీఎం కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది. అంతే కాకుండా అవసరమైన అన్ని పత్రాలను సమకూర్చుకున్నామని వెల్లడించింది. కేజ్రీవాల్‌‌ను 5 రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ చేసిన దరఖాస్తుపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే సీబీఐ అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు టీ, బిస్కెట్ అందించారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌తో పాటు ఆయన సతీమణి సునీత కూడా ఉన్నారు.

- Advertisement -

మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉండటం వల్ల బీజేపీ భయాందోళనకు గురైందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. అందుకే ఫేక్ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ ద్వారా అరెస్ట్ చేయించిందని ఆరోపించింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు 3 రోజుల కస్టడీకి ఇచ్చింది. కోర్టులో ఆయనను హాజరుపరిచిన సీబీఐ 5 రోజుల కస్టడీని కోరింది. కానీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. 29వ తేదీ సాయంత్రం 7 గంటలలోగా కోర్టులో హాజరు పరచాలని సీబీఐని ఆదేశించింది.

Also Read: లిక్కర్ కుంభకోణం కేసులో న్యూట్విస్ట్, సీబీఐ కస్టడీలో కేజ్రీవాల్‌

కోర్టు విచారణ సమయంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మనీష్ సిసోడియా నిర్దోషి అని అన్నారు. కేసు విచారణ సమయంలో ఆయనే స్వయంగా మాట్లాడారు. మనీష్ సిసోడియాపై వాంగ్మూలం ఇచ్చానని మీడియాకు సీబీఐ చెబుతోందని అభ్యంతం తెలిపారు. కానీ తాను ఎలాంటి ప్రకటన ఇవ్వలేదన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ఆరోపణలను సీబీఐ ఖండించింది.

కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ స్పందించారు. కేజ్రీవాల్ ను జైలులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యవస్థలన్నింటినీ ప్రయోగిస్తోందని, ఈ చర్యలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆమె ఆరోపించారు. కేజ్రీవాల్ కు జూన్ 20 న బెయిల్ లభించిన విషయం తెలిసిందే అయితే ఆ వెంటనే ఈడీ స్టే ఉత్తర్వులు తీసుకుంది. మరుసటి రోజే సీబీఐ ఆయనపై అభియోగాలు మోపిందని సునీతా కేజ్రీవాల్ వివరించారు. కేజ్రీవాల్ బయటకు రాకుండ ఉండేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News