Big Stories

Delhi Airport roof collapsed: మోదీ ప్రారంభించిన భవనం కాదు.. మృతుడికి 20 లక్షలు:మంత్రి రామ్మోహన్

Delhi Airport roof collapse news(Today’s breaking news in India): దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణం గా ఎయిర్‌‌పోర్టు టెర్నినల్ వన్‌లో పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దీనిపై రాజకీయ రగడ మొదలైంది.

- Advertisement -

కొద్దిరోజుల కిందట ఈ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని, వందల కోట్లతో నిర్మించిన టెర్మినల్ చిన్న వర్షానికి కుప్పకూలిందంటూ విమర్శలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నేతలు సైతం మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో మోదీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతికి ఇదే నిదర్శనమని దుయ్యట్టారు. ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.

- Advertisement -

శుక్రవారం తెల్లవారుజామున కూలిన టెర్నినల్ 2009లో ప్రారంభించారన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన భవనం అటువైపు ఉందన్నారు. కూలిన టెర్నినల్ పైభాగంలో బీమ్‌లు తుప్పుపట్టడంపై మీడియా ప్రశ్నించింది. దీనిపై ఇప్పుడు మాట్లాడడం తొందరపాటు చర్య అవుతుందని, డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తుందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి.

ఎయిర్‌పోర్టు టెర్నినల్ వన్‌లో పైకప్పు కూలింది. ఈ ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్వయంగా పరిశీలించారు. విచారం వ్యక్తంచేసిన ఆయన, తీవ్రమైన ఘటనగా వర్ణించారు. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఇస్తామని తెలిపారు. అనంతరం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు.

ALSO READ:  డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే- ఇండియా కూటమికా? లెక్కలు..

ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్ ట్రావెలర్లు ఇబ్బందులకు గురయ్యారు. వారు ప్రయాణించాల్సిన విమానాల గురించి సరైన సమాచారం లేకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. పరిస్థితి గమనించిన డీజీసీఏ, ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని, రద్దయితే టికెట్ రీఫండ్ ఇవ్వాలని వెల్లడించింది.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News