Big Stories

Dead frog found: చిప్స్ ప్యాకెట్‌లో కుళ్లిపోయిన కప్ప.. షాకైన కస్టమర్.. తర్వాత ఏమైందంటే..?

Dead frog found in Chips packet: కస్టమర్ ను దేవుడిలా భావించాలన్నది వ్యాపారం రంగంలో ముఖ్య ఉద్దేశం. కానీ, కొందరు వ్యాపారులు, పలు హోటళ్లు వ్యవహరించే తీరు రోజురోజుకు మరీ అధ్వాన్నంగా ఉంటుంది. లాభాపేక్షే ధ్యేయంగా ముందుకు వెళ్తూ కస్టమర్ల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడెందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే.. సోషల్ మీడియాలో అప్పడప్పుడు పలు వీడియో, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఆహారంలో పురుగులు వచ్చాయని, కుళ్లిపోయిన ఆహారం వడ్డించారని, కాలం చెల్లిన వస్తువులను అమ్ముతున్నారంటూ వాటిలో పేర్కొంటుంటారు.

- Advertisement -

అయితే, ఇటీవల కూడా ఓ ఐస్ క్రీమ్ లో మనిషి వేలు, చాక్లెట్ సిరప్ లో చిట్టెలుక కనిపించిన సందర్భాలు చూశాం. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వింటే నిజంగా మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. చిప్స్ ప్యాకెట్ లో కప్ప కళేబరం కనిపించింది. అది కూడా కుళ్లిపోయిన కప్ప కళేబరం. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆలు చిప్స్ ప్యాకెట్ లో చనిపోయిన కప్ప బయటపడింది. అది చూసిన కస్టమర్ షాకయ్యాడు. ఇందుకు సంబంధించి సంబంధిత శాఖకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అధికారులు దీనిపై స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు బాలాజీ వేఫర్స్ తయారు చేసిన చిప్స్ ప్యాకెట్ లో కుళ్లిపోయిన కప్ప కళేబరం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

అదేవిధంగా, విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భోజనంలో మెటల్ బ్లేడ్ కనిపించింది. బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న విమానంలో ప్రయాణం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానంలో అందించిన భోజనంలో మెటల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. సదరు సంస్థ ఇది నిజమేనంటూ నిర్ధారించి అతనికి క్షమాపణలు చెప్పింది. అంతేకాదు.. ఇందుకు పరిహారంగా ప్రపంచంలో ఎక్కడికైనా ఉచిత బిజినెస్ క్లాస్ ట్రిప్ ను ఆఫర్ చేసింది. కానీ, అతడు ఆ ఆఫర్ ను తిరస్కరించాడు.

Also Read: ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. వడదెబ్బకు ఏడుగురు మృతి

ఇలా నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా వారిలో మాత్రం మార్పు రావడంలేదు. ఈ విషయంలో ప్రభుత్వాలు చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News