Big Stories

Kuwait Fire Accident Dead Bodies : కేరళ చేరుకున్న కువైట్ ప్రమాద మృతదేహాలు.. ఎయిర్ పోర్టులో నివాళులు

Kuwait Fire Accident Dead Bodies : కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు భారత్ కు చేరుకున్నాయి. ఇండియన్ నేవీ విమానంలో కువైట్ నుంచి మృతదేహాలు తీసుకొచ్చారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా అదే విమానంలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మృతులకు ఎయిర్‌పోర్టులో నివాళులు అర్పించారు. కొచ్చి విమానాశ్రయం దగ్గర అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. కాసేపట్లో ఆ మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించనున్నారు. ఇక మిగిలిన రాష్ట్రాలకు చెందిన మృతదేహాలు ఆయా రాష్ట్రాలకు పంపిస్తారు.

- Advertisement -

కువైట్ అగ్ని ప్రమాదంలో 49 మంది మృతి చెందారు. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. ప్రమాదంలో మరణించినవారిలో 23 మంది కేరళకు చెందినవారు కాగా, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు కూడా ఉన్నారు. ఏపీలో శ్రీకాకుళం జిల్లాకి చెందినవారు ఒకరు, తూర్పు గోదావరికి చెందిన వారు ఇద్దరు మృతి చెందారు. ఆ ఇద్దరి మృతదేహాలు కూడా చేరుకున్నాయి. కాసేపట్లో మృతదేహాలను అధికారులు వారి స్వస్థలానికి తరలించనున్నారు.

- Advertisement -

మృతుల్లో బిహార్‌, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, హర్యానా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రధాని ఆదేశాలతో నిన్న కువైట్ వెళ్లిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. అక్కడి అధికారులతో చర్చించారు. మృతదేహాలను అప్పగించే విషయంపై మాట్లాడారు. ఫార్మాలటీస్ పూర్తి అయిన తర్వాత ప్రత్యేక విమానంలో మృతదేహాలు భారత్ కు చేరుకున్నాయి. ఇక నిన్న కేంద్రమంత్రి కువైట్ లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News