Big Stories

Crocodile Halchal at busy road: మహారాష్ట్రలో భారీ వర్షాలు, రోడ్డుపైకి మొసలి, కొట్టుకుపోయిన ఫ్యామిలీ

Crocodile Halchal at busy road: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతానికి దగ్గరలో రత్నగిరి జిల్లాలో రెస్ట్ లేకుండా రాత్రింబవళ్లు వర్షాలు జోరందుకున్నాయి. వాగులు, వంకలు, చెరువు, సాగర్లు పొంగి ప్రవహిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా కొంకణ్ ప్రాంతంలోని చిప్లన్ పట్టణం రోడ్లపై రాత్రి భారీ ముసలి వచ్చింది. రోడ్డుపై చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. అదే రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను తమ వాహనాలను ఆపేసి దాన్ని తిలకించారు. మరికొందరు దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది.

- Advertisement -

దీనికి సంబంధించి వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసినవాళ్లు మాత్రం ఇంత పెద్ద మొసలిని తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. సమీపంలోని పెద్ద చెరువు ఉందని బహుశా అక్కడి నుంచి బయటకు వచ్చిందని అంటున్నారు. కొంకణ్ ప్రాంతంలో అడవి, నీటిలోని జంతువులు రోడ్లపైకి వచ్చిన సందర్భాలు అప్పుడప్పుడు మాత్రమే చూశామని అంటున్నారు.

ఇదిలావుండగా మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలోని భూషీ డ్యామ్ వద్ద ఉన్న వాటర్ ఫాల్ చూసేందు కు ఓ కుటుంబం వెళ్లింది. అనుకోకుండా పైనుంచి వరద ప్రవాహానికి ఒక్కసారిగా పెరిగింది. వాటర్ ఫాల్ మధ్యలోనే ఉండిపోయింది ఆ ఫ్యామిలీ సభ్యులు. దాన్ని బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు వరదలో కొట్టుకుపోయింది ఆ కుటుంబం. లియాఖత్ అన్సారీ, అమీమా ఆదిల్ అన్సారీ, ఉమేరా ఆదిల్ అన్సారీ మృతదేహాలు లభించాయి. అద్నాన్ సబాహత్ మృతదేహం కనిపించలేదు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News