Big Stories

Congress Writes to Lok Sabha Speaker: ఎన్నికల ప్రచారాలకు వెళ్లిన మోదీ.. ఏ రకమైన సెలవులు పెట్టారో చెప్పాలి: కాంగ్రెస్

Congress Writes to Lok Sabha Speaker(Political news telugu): లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ లేఖ రాశారు. సత్యదూరమైన ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారంటూ ప్రధాని మోదీ, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి అతిపెద్ద వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కల్లబొల్లిమాటలు చెబుతోందంటూ పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

- Advertisement -

ప్రధాని మోదీపై రాజ్యాంగంలోని 115(1) నిబంధన ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నిబంధనలకు ప్రకారం ఎవరైనా ఎంపీ సభలో అసత్య ప్రకటనలు చేస్తే, సభాముఖంగా వాటిని తూర్పారబెట్టాలని ఎవరైనా సభ్యులు భావించినప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తకముందే స్పీకర్ లేఖ రాయాల్సి ఉంటుందన్నారు. చర్చ జరిపిన తరువాత ఆ ప్రకటనలు తప్పని నిరూపిస్తే రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారంటూ గుర్తుచేశారు.

- Advertisement -

Also Read: ప్రధాని మోదీ రష్యా పర్యటన.. అయిదేళ్ల తరువాత తొలిసారి

మహిళలకు నెలకు రూ. 8,500 ఇస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు వాగ్ధానం చేసిందంటూ మంగళవారం ప్రధాని మోదీ లోక్ సభలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఠాగూర్ తన లేఖలో ప్రస్తావిస్తూ.. విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తరువాత ఇస్తామని చెప్పాం.. అంతేకానీ, అధికారంలోకి రాకున్నా ఇస్తామని చెప్పామా..?.. అలాంటప్పుడు అది తప్పుడు వాగ్ధానం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన రాష్ట్రాల్లో 16 చోట్ల ఓట్ షేర్ పడిపోయిందని ప్రధాని మోదీ అన్నారని.. అయితే, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ అనూహ్యంగా పెరిగిందన్నారు. మరి అలాంటప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ప్రకటనలని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

ఆర్మీ జవాన్లకు సంబంధించి ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రస్తావించారని.. కాంగ్రెస్ హయాంలో ఆర్మీ జవాన్లకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను సమకూర్చలేదని మోదీ పేర్కొనడం సరికాదన్నారు. అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, అసలు జాకెట్లే లేవనడం సమంజసం కాదన్నారు. ముంబై దాడుల సమయంలో కూడా స్థానిక పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందజేశామన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జాగ్వార్, మిగ్ 29, ఎస్ యూ-30, మిరాజ్-2000 లాంటి ఫైటర్ జెట్ లతో న్యూక్లియర్ బాంబులు, అకాశ్, నాగ్, త్రిశూల్, అగ్ని, ప్రథ్వీ ఆ తరువాత బ్రహ్మోస్ లాంటి అద్భుతమైన క్షిపణులు అందుబాటులో తెచ్చామన్నారు.

Also Read: ఝార్కండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మందిని అభివృద్ధి పథంవైపు నడిపించామన్న వ్యాఖ్యల్లో కూడా నిజం లేదన్నారు. మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నారని బీజేపీ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలకు వెళ్లిన మోదీ.. ఏ రకమైన సెలవులు తీసుకుని అక్కడికి వెళ్లారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ విధంగా బీజేపీ చేసిన అసత్య ప్రకటనలను రికార్డులో ఉంచుతారు.. నిజం మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలనేమో రికార్డుల్లోంచి తొలగిస్తారా? అంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News