Big Stories

Rahul Gandhi as Opposition Leader: లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. కొత్త పదవితో పెరిగిన బాధ్యతలు..!

Congress MP Rahul Gandhi appointed Leader of Opposition in Lok Sabha: రాజకీయం పూల పాన్పు కాదు. ముళ్ల కిరీటమే. ఈ డైలాగ్‌ అందరికి తెలిసిందే. పదవులు వస్తున్నాయంటే.. అదే టైంలో బాధ్యత కూడా వస్తుంది. పదవిని ఎంత హ్యాపీగా తీసుకుంటారో.. బాధ్యతను కూడా అంతే సంతోషంగా స్వీకరించాల్సిందే. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ ఎలెక్ట్‌ అయ్యారు. 2014,2019లో లోక్‌సభలో విపక్ష నేతనే లేరు. విపక్ష నేత అంటే ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాలంటే సెకండ్‌ ఇన్‌ హౌజ్‌. అంటే.. సభానాయకునికి ఇచ్చేంత గౌరవం, విలువ ఉంటుంది. అలాంటి బాధ్యత రాహుల్‌గాంధీకి దక్కింది. మరీ ఆ బాధ్యతకు రాహుల్ న్యాయం చేస్తారా? ప్రజల గొంతుకగా సభలో సమరశంఖం పూరిస్తారా? అనేది ఇక్కడ మేటర్.

- Advertisement -

రాహుల్‌గాంధీకి ఆ పదవి అంత ఈజీగా రాలేదు. 2014-2019 మధ్య కాంగ్రెస్‌ అతి క్లిష్టమైన దశను ఎదుర్కొంది. వరుసగా రెండోసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కానీ ఈ సారి 99 స్థానాలతో లోక్‌సభలో ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది. కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి 234 సీట్ల దక్కించుకోవడం వెనక రాహుల్ పాత్ర ఉంది. గాంధీ కుటుంబం వారసుడిగా, సోనియా గాంధీ కొడుకుగా ముద్రపడింది రాహుల్ కు.

- Advertisement -

మోడీ హయాంలో.. అంటే రెండు టర్మ్ లు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరూ లేరు. మోడీ సర్కార్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా నడిచింది. కానీ ఇప్పుడు లోక్ సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నారు. అది కూడా రాహుల్ గాంధీ.. కాబట్టి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేరుగా ఢీకొట్టే అద్భుతమైన అవకాశం రాహుల్ చేతిలో ఉంది. ప్రజల గొంతుకగా రాహుల్ సభను దడదడలాడించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం చేసే ప్రజావ్యతిరేక పనులపై తన గళాన్ని వినిపించనున్నారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కు సభలో మాట్లాడేందుకు ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాన్ని రాహుల్ ఈ ఐదేళ్లు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే పార్టీకి.. పర్సనల్ గా తనకు కూడా ఎంతో ప్రయోజనం.

Also Read: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గింది.. అదే టైంలో కాంగ్రెస్ పుంజుకుంది. అయితే దక్షిణాదినా బీజేపీకి.. ఉత్తరాదినా కాంగ్రెస్ కు లాభం జరిగింది. నార్త్ తమ కంచుకోట అనుకున్న బీజేపీకి అక్కడ దెబ్బ పడింది. అందుకు కారణం రాహుల్ చేసిన న్యాయ్ యాత్ర ఒక్కటని చెప్పొచ్చు. ఆ యాత్రతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అందరికీ కనెక్ట్ అయ్యారు. మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జనాల్లోకి అసలు విషయాలను తీసుకెళ్లారు. అందుకే ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయి. దీన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలి. వచ్చే ఐదేళ్లు కూడా  రాహుల్ ఇదే పంథాను కొనసాగించాలి. ప్రజల్లో ఉండాలి. ప్రజల కోసమే పనిచేయాలి. అప్పుడు జనమే రాహుల్ ను ఆశీర్వదిస్తారు.. అందలమెక్కిస్తారు.

భవిష్యత్ తో కాంగ్రెస్ గెలుపులో కీ రోల్ అయ్యేది రాహులేనా? అవును.. కచ్చితంగా రాహుల్ ఈ ఐదేళ్లు ఎలా నడుచుకుంటారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయనకు పార్టీని, కేడర్ ను మళ్లీ గాడిన పెట్టే సువర్ణ అవకాశం దక్కింది. తన నాయకత్వ పటిమతో ఓ రోల్ మోడల్ గా నిలిచే ఛాన్స్ ఉంది. అంతేకాదు అనేక సెలక్షన్ కమిటీల్లో రాహుల్ కు ప్రాధాన్యం ఉంటుంది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు.. వాటి పనితీరును మనం ఈ పదేళ్లలో చూశాం. ఆ సంస్థలకు చీఫ్‌లను ఎన్నుకునేందుకు ఓ సెలక్షన్‌ కమిటీ ఉంటుంది. అందులో ప్రధానితో పాటు.. ఎవరైతే LOP ఉంటారో వారు, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మాత్రమే ఉంటారు. అంటే ఈ ఐదేళ్లు.. సీబీఐ, ఈడీ చీఫ్‌ల ఎంపికలో రాహుల్‌ గాంధీ కూడా కీరోల్‌ ప్లే చేస్తారన్నమాట.

Also Read: Jagan alone in Bangalore : బెంగళూరులో ఒంటరిగా జగన్.. ఏం చేస్తున్నారు అక్కడ ?

మొత్తంగా కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలంటే ఈ ఐదేళ్లు కీలకం. బీజేపీ ప్రభ తగ్గుతున్న ఈటైంలో హస్తం పార్టీ జోరుపెంచాలి.. మరీ ముఖ్యంగా నాయకులు పుంజుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. ఇలాంటి టైంలో రాహుల్ LOPగా ఎంపికకావడం పార్టీ కేడర్ కు నిజంగా జోష్ ఇచ్చే అంశమే. కాబట్టి ఆల్ ది బెస్ట్.. మిస్టర్ LOP.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News