Big Stories

Rahul Gandhi: బీజేపీ పాలిత రాష్ట్రాలే పేపర్ లీకేజీలకు కేంద్రాలు: రాహుల్ గాంధీ

Rahul Gandhi Takes a dig on PM Modi Over NEET-UG Row: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థుల ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటలకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

- Advertisement -

సోషల్ మీడియా ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ ఎప్పటిలాగే మౌనం పాటిస్తున్నారని పేర్కొన్నారు. 24 లక్షల విద్యార్థుల జీవితాలు ముడిపడి ఉన్న అంశంపై ప్రధాని మౌనం వహిస్తున్నారని తెలిపారు. బీహార్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలలో జరిగిన అరెస్టులు పరీక్షలో అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పేపర్ లీకేజీకి బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రంగా మారాయిన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తమ మేనిఫెస్టో ప్రస్తావన తీసుకొచ్చారు. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను రూపొందించి భారతదేశ యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి వాటిపై ప్రతిపక్షాలుగా తమ బాధ్యత నిర్వర్తిస్తూనే వీధుల్లో యువత గొంతును బలంగా వినిపించి పార్లమెంట్‌కు వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు రాహుల్ గాంధీ.

Also Read: ‘నీట్‌’ పేపర్‌ లీక్‌.. దర్యాప్తులో సంచలన విషయాలు.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు

ఇదిలా ఉండగా, పేపర్ లీకేజీపై ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అంతకుముందు రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి గట్టి వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పరీక్షా ప్రక్రియలో 0.001% నిర్లక్ష్యాన్ని కూడా అత్యంత తీవ్రంగా పరిగణించాలని కోర్టు నొక్కి చెప్పింది. విచారణ సందర్భంగా, నీట్ పరీక్షలో అవకతవకలపై అనేక ఫిర్యాదులపై సుప్రీంకోర్టు స్పందించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News