Big Stories

EVM: ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన రాహుల్ గాంధీ!

Congress Leader Rahul Gandhi: ఎన్నికల ఓటింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లు హ్యాకింగ్ కు గురవ్వడంపై ప్రముఖ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతోనే హ్యాకింగ్ ను నివారించవచ్చంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, భారత్ లో ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు.

- Advertisement -

దేశంలోని ఈవీఎంలను ‘బ్లాక్ బాక్స్’ అంటూ ఆయన అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్ని ఉదహరిస్తూ ఆయన సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ చేశారు. ‘ఇండియాలో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి లేదు. మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’ అంటూ రాహుల్ గాంధీ అందులో పేర్కొన్నారు.

- Advertisement -

సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది.. మోసానికి గరవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్ ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చినటువంటి వార్తా కథనాలను ఉదహరిస్తూ అందులో షేర్ చేశారు.

అయితే, ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్ సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొన్నది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలిచారనే ఆరోపణలు వచ్చాయి.

కౌంటింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ఈవీఎం మెషిన్ కు మంగేష్ పన్హాల్కర్ ఫోన్ కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్ లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్ లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యే విధంగా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు కూడా చెబుతున్నాయి. మంగేష్ పన్హాల్కర్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన విషయం తెలిసిందే.

Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం.. వాటర్ పైపులైన్లకు పోలీసు భద్రత ?

ఇదిలా ఉంటే.. ఈవీఎంలను నిషేధించాలంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్ లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుందన్నారు. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News