Big Stories

Rahul Gandhi: రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ.. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా? అంటూ..

Rahul Gandhi Emotional letter: ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్.. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఆ తరువాత వయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే, ఈ స్థానానికి త్వరలో జరగబోయే ఉపఎన్నికలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలో నిలువనున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్ ప్రజలను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ రాశారు. తన నిర్ణయాన్ని మీడియాతో వెల్లడించేందుకు చాలా బాధపడినట్లు తెలిపారు. తాను విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వయనాడ్ ప్రజల ప్రేమాభిమానాలే కాపాడాయని, తనకు ఆశ్రయం కల్పించి, ఓ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారంటూ రాహుల్ భావోద్వేగంగా తెలిపారు.

- Advertisement -

‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ వయనాడ్.. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నా నిర్ణయాన్ని మీడియాతో చెప్పేటప్పుడు మీరంతా నా కళ్లల్లో బాధను చూసే ఉంటారు. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా..? మీ మద్దతు కోరుతూ ఐదేళ్ల క్రితం మిమ్మల్ని కలిశాను. అప్పటికి మీకు నేను పెద్దగా పరిచయం లేకపోయినా మీరు నన్ను నమ్మి గెలిపించారు. నాపై అవధుల్లేని ప్రేమాభిమానాలు కురిపించారు. మీరు ఏ వర్గానికి చెందినవారైనా, ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చినా, రోజురోజుకు నాపై వేధింపులు ఎక్కువైనప్పుడు మీరు నాకు అండగా నిల్చున్నారు. మీ అనిర్వచనీయమైన ప్రేమనే నన్ను రక్షించింది.

ముఖ్యంగా వరదల సమయంలో ఎదురైనటువంటి పరిస్థితులను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఒక్కో కుటుంబం తమ జీవితాలను కోల్పోయిన, యావదాస్తులు గంగలో కొట్టుకుపోయినా మీలో ఒక్కరు కూడా హుందాతనాన్ని కోల్పోలే. అదే హుందాతనంతో మళ్లీ నన్ను గెలిపించారు. మీ అంతులేని ప్రేమను నేను ఎప్పటికీ గుర్తించుకుంటా. వేలాది మంది ప్రజల ఎదుట నా ప్రసంగాలను అనువాదం చేసిన ధైర్యసాహసాలు కలిగిన ధీర యువతుల విశ్వాసాన్ని ఎలా మరిచిపోగలను.? పార్లమెంటులో మీ తరఫున గళమెత్తడం నిజంగా నాకు ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చింది.

Also Read: గ్రేస్ మార్కులు పొందిన వారికి రీ ఎగ్జామ్.. సగం మంది డుమ్మా..

అయితే, నాకు ఎంతో బాధగా ఉన్నా..వెళ్లకతప్పడం లేదు. మీ తరఫున పోరాడేందుకు నా సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు. మీరు ఆమెకు అవకాశం ఇస్తే మీ ఎంపీగా అద్భుతంగా పని చేస్తారనే నమ్మకం నాకు ఉంది. రాయ్‌బరేలీలోనూ మీలాగే ఆదారాభిమానాలు చూపించే ప్రజలున్నారు. మీకు, రాయబరేలీ ప్రజలకు ఒకే మాట ఇస్తున్నాను. దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింసపై పోరాడి వాటిని ఓడిస్తా. అత్యవసర సమయంలో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడంలేదు. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీ అందరికీ అన్ని సమయాల్లో అండగా ఉంటా.. ధన్యవాదాలు’ అంటూ రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News