Big Stories

CM Mamata to campaign for Priyanka: సీఎం మమత క్లారిటీ, బరిలో ఉంటే ప్రియాంక తరపు ప్రచారం…

CM Mamata to campaign for Priyanka(Political news telugu): రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఎప్పుడు.. ఎవరు ఎటువైపు తిరుగుతారో ఊహించలేము. రాష్ట్రాలే కాదు.. దేశ రాజకీయాలూ అంతే. తాజాగా సీఎం మమతాబెనర్జీ ఓ విషయాన్ని బయటపెట్టారు. వయనాడ్ ఉప ఎన్నికల బరిలో ప్రియాంకగాంధీ దిగితే ఆమె తరపున ప్రచారం చేస్తారంటూ సీఎం మమత చెప్పినట్టు నేషనల్ మీడియాలో ఒకటే వార్తలు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

- Advertisement -

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రెండు చోట్ల గెలుపొందారు. ఒకటి రాయ్‌బరేలీ కాగా, మరొకరు వయనాడ్. అయితే వయనాడ్ సీటును ఆయన వదులుకున్నారు. ఆ ప్లేస్‌లో ప్రియాంకగాంధీ బరిలోకి దిగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆమె, ఇప్పటివరకు ఎన్నికల బరిలోకి దిగలేదు. బైపోల్‌ బరిలోకి దిగితే ప్రియాంక గెలుపు సునాయాశమేనని అంటున్నారు నేతలు.

- Advertisement -

వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీ బరిలోకి దిగితే ఆమె తరపు ప్రచారం చేస్తానంటూ బెంగాల్ సీఎం మమతా అన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. మమతా మాటలపై చర్చించుకోవడం నేతల వంతైంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మమతా పార్టీ ఎక్కువ సీట్లను బెంగాల్‌లో గెలుచుకుంది. అంతేకాదు కేంద్రంలో బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించింది. మొత్తం 42 సీట్లకు గాను 29 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 22 సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది.

ALSO READ:  కేంద్రం కొత్త చట్టం, పేపర్ లీక్ చేస్తే.. ఐదేళ్లు జైలు, కోటి జరిమానా..

ఫలితాల తర్వాత ఇండియా కూటమికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఓపెన్‌గా చేప్పేవారు సీఎం మమత. ఈ క్రమంలో ప్రియాంకగాంధీ తరపున ప్రచారం చేస్తానని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ లెక్కన ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు లేవని చెప్పకనే చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News