Big Stories

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో అర్వింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసందే. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం కేజ్రీవాల్‌ను  హాజరు పరచడగా కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది.

- Advertisement -

ఇవాల్టితో మూడు రోజుల సీబీఐ రిమాండ్ ముగియటంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం మరో రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూలై 12 వరకు కేజ్రీవాల్ రిమాండ్ కొనసాగనుంది.

- Advertisement -

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకారం తెలిపింది,

విచారణ సమయంలో కేజ్రీవాల్ సరిగా సహకరించలేదని సీబీఐ రిమాండ్ దరఖాస్తులో కోర్టుకు వెల్లడించింది. నేరం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలకు విరుద్ధంగా కేజ్రీవాల్ సమాధానాలు ఇచ్చారని అంతేకాకుండా కొన్నింటికి అసలు సమాధానం చెప్పలేదని తెలిపింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ ను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.

Also Read: నీట్‌ పీజీ నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు

సీబీఐ అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ ను జూలై 12 వరకు జుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆయనను జూలై 12 రోజున కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థించిన కొన్ని గంటలకే ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో కోర్టు అనుమతితో సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News