Big Stories

Electronics : ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో చైనా టాప్

Electronics : వరల్డ్ ఎకానమీలో ఎలక్ట్రానిక్స్ వ్యాపారరంగం అత్యంత కీలకం. పర్సనల్ కంప్యూటర్ల నుంచి మెమొరీ చిప్‌ల వరకు ఎలక్ట్రానిక్స్ పరికరాల ఎగుమతుల విలువ 4.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యాపారంలో ఆసియా దేశాలే ముందంజలో ఉన్నాయి.

- Advertisement -

టాప్ టెన్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోర్టర్లలో చైనా అగ్రభాగాన ఉందని మెకెన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. 2021 నాటి ఎగుమతుల్లో డ్రాగన్ వాటా 34% గా ఉంది. దీని విలువ 1.4 ట్రిలియన్ డాలర్లు. 11 శాతం ఎగుమతుల వాటాతో తైవాన్ రెండోస్థానంలో నిలిచింది. సెమీకండక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థ టీఎస్ఎంసీ ఉన్నది ఆ దేశంలోనే.

- Advertisement -

7% వాటాతో దక్షిణ కొరియా మూడోస్థానంలో నిలిచింది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 5% వాటాతో వియత్నాం, మలేసియా దేశాలు 4,5 స్థానాలకు పరిమితమయ్యాయి. ఈ రంగంలో రెండు దశాబ్దాల క్రితం జపాన్‌దే ఆధిపత్యం ఉండేది. 2000లో ఎగుమతుల్లో 13% వాటా ఆ దేశానిదే. కానీ 2021 నాటికి పరిస్థితి తలకిందులైంది. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఎగుమతుల్లో జపాన్ షేర్ 4 శాతానికి పడిపోయింది.

అమెరికా కూడా అంతే. 2000లో 16% ఎగుమతులు ఉండగా.. రెండు దశాబ్దాల అనంతరం 4 శాతానికే పరిమితం కావాల్సి వచ్చింది అగ్రరాజ్యం. ఎగుమతుల్లో జర్మనీ 4% వాటా ఉండగా.. మెక్సికో, థాయ్‌లాండ్ దేశాల వాటా 3% చొప్పున ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News