Big Stories

Ayodhya: అయోధ్య రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత

Ayodhya: అయోధ్య రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితుడు పండిత్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం కన్నుమూశారు. 86 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన హందూ సమాజం పట్ల ఎంతో భక్తి, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అయోధ్య రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎంపికైన 121 మంది పండితుల బృందానికి పండిత్ లక్ష్మీకాంత్ నాయకత్వం వహించారు. వారణాసికి చెందిన మధురనాథ్ దీక్షిత్ 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కాశీ పండితుడు. గాగా భట్ వారసుడు దీక్షిత్ వంశస్తులు 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి నాయకత్వం వహించారు.

- Advertisement -

ఆచార్య మృతి పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. దీక్షిత్ మృతి సమాజానికి తీరని లోటు అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యెగీ ఆదిత్యనాథ్ ఆచార్య దీక్షిత్ మృతికి సంతాపం తెలుపుతూ కాశీకి చెందిన శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ మరణం ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు పూడ్చలేని లోటని, సంస్కృత భాష భారతీయ సంస్కృతికి దీక్షిత్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News