Big Stories

Blast in Chhattisgarh: దండకారణ్యంలో ఐఈడీ బ్లాస్ట్.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి..!

IED Blast in Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మృతులను సీఆర్పీఎఫ్ కోబ్రా 201 బెటాలియన్‌కు చెందినవారిగా గుర్తించారు. సుక్మా జిల్లాలోని జాగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గర్, టేకులగూడెం మధ్య మావోయిస్టులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ను అమర్చారు.

- Advertisement -

సీఆర్పీఎఫ్ జవాన్లు శైలేంద్ర(29), డ్రైవర్ విష్ణు(35) ప్రయాణిస్తోన్న ట్రక్కును లక్ష్యంగా చేసుకున్న మావోలు.. ఆ వాహనాన్ని పేల్చేశారని స్థానిక పోలీసులు తెలపారు. ఈ పేలుడు ధాటికి ఇద్దరు జవాన్లు మరణించారని స్పష్టం చేశారు.

- Advertisement -

రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో భద్రతా బలగాల సిల్గర్, టేకులగూడెం శిబిరాల మధ్య తిమ్మాపురం గ్రామ సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం, జవాన్ మృతి

కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ 201వ యూనిట్ అడ్వాన్స్ పార్టీ టేకులగూడెం వైపు రోడ్ ఓపెనింగ్ పార్టీ డ్యూటీలో భాగంగా జాగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గర్ క్యాంపు నుంచి పెట్రోలింగ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పేలుడు గురించి అప్రమత్తమైన తరువాత, మరిన్ని బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని.. మృతదేహాలను అడవి నుంచి తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News