Big Stories

Kuno National Park : ఆగని చీతాల మరణాలు.. మరో రెండు కూనల మృత్యువాత..

Kuno National Park : భారత్ చేపట్టిన చీతాల ప్రాజెక్టుకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు మొత్తం 20 చీతాలు తీసుకొచ్చారు. వాటిలో 3 ఇప్పటికే మృతిచెందాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ చీతాకు నాలుగు కూనలు జన్మించాయి. వాటిలో ఇప్పటికే మూడు కూనలు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఓ చీతా కూన మృతిచెందింది. గురువారం మరో రెండు చీతా కూనలు ప్రాణాలు కోల్పోయినట్లు జూ అధికారులు ప్రకటించారు.

- Advertisement -

నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాల అనే చీతా రెండు నెలల క్రితమే 4 కూనలకు జన్మినిచ్చింది. కునో నేషనల్ పార్కు ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి వాతావరణం వల్ల కూనలు నీరసించిపోయినట్లు పార్కు లో పర్యవేక్షకులు గుర్తించారు. పశువైద్యులు వాటికి చికిత్స అందించారు. అయినా సరే అవి కోలుకోలేదు. మంగళవారం ఒకటి, గురువారం రెండు కూనలు మృత్యువాతపడ్డాయి. ఇక ఒక చీతా కూన మాత్రమే ఉంది.

- Advertisement -

కునో పార్కులో చీతాలు స్వేచ్ఛగా సంచరించడానికి ఏర్పాట్లు చేయాలని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన అటవీ జంతువుల నిపుణుడు విన్సెంట్‌ వాన్‌ డెర్‌ మెర్వే చెప్పారు.
కంచెలు నిర్మించాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఇతర జంతువులు, మనుషుల సంచారాన్ని నివారించే చర్యలు చేపట్టాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని చీతాలు మృత్యువాత పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News