Big Stories

CBSE Results 2024: సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు విడుదల, చెక్ చేసుకోండిలా..!

CBSE Results 2024: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. పదో తరగతిలో 93.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంట్లో అమ్మాయిలు 94.75 శాతం మంది పాసయ్యారు. టెన్త్ లో అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులు అయ్యారు. అబ్బాయిల కన్నా2.04 శాతం మంది అమ్మాయిలు అధికంగా పాసయ్యారు.

- Advertisement -

పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలు 94.75 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సుమారు 47 వేల మంది విద్యార్థులు..95 శాతం కన్నా ఎక్కువగా మార్కులు సాధించారు. 2.12 లక్షల మంది 90 శాతం కన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. తిరువనంతపురంలో అత్యధికంగా 99.75 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు నిర్వహించారు.

- Advertisement -

12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు పరీక్షల ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. తిరువనంతపురంలోనే 99.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి పరీక్షలనుఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. విద్యార్థుల్లో పోటీతత్వం లేకుండా చేసేందుకు మెరిట్ జాబితాను సీబీఎస్ఈ ప్రకటించడం లేదు.

Also Read: ఎన్నికల వేళ హై అలర్ట్.. జైపూర్‌లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు..

cbscresults.nic.in లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్ సైట్ ఓపెన్ చేసి రూల్ నంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంపిక చేసి స్కోరు చూసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News