Big Stories

CBI Arrested Delhi CM Kejriwal: లిక్కర్ కుంభకోణం కేసులో న్యూట్విస్ట్.. సీబీఐ కస్టడీలో కేజ్రీవాల్‌..

CBI Arrested Delhi CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్. రేపోమాపో హైకోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న ఆయన్ని సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది.

- Advertisement -

తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను బుధవారం అధికారులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ఆయన ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే న్యాయమూర్తి అమితాబ్‌ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో ఖంగుతిన్నారు ఆప్ నేతలు. ఓ వైపు ఈడీ, మరోవైపు సీబీఐ కస్టడీ నేపథ్యంలో ఆయనకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమని అంటున్నారు నేతలు.

- Advertisement -

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించు కున్నారు సీఎం కేజ్రీవాల్. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.

Also Read: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా, ప్రధాని మోదీ, రాహుల్ శుభాకాంక్షలు

ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు తొమ్మిదిసార్లు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకుంది ఈడీ. జైలులో ఉన్న సమయంలో పలుమార్లు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారు. చివరకు  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రచారం తర్వాత తీహార్ జైలులో ఆయన లొంగిపోయిన విషయం తెల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News